Bollywood war: తాప్సీపై మ‌రోసారి ఫైర్ అయిన కంగ‌నా..

Bollywood war: బాలీవుడ్‌లో లేడీ క్వీన్ కంగనా ర‌నౌత్‌- స్టార్ హీరోయిన్ తాప్సీ మ‌ధ్య మ‌రోసారి వాడీ వేడీ చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌తంలో తాప్సీని బి గ్రేడ్ అంటూ కంగ‌నా కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. తాప్సీ త‌న‌ను కాపీ కొడుతుంద‌ని అలాగే బాలీవుడ్ మాఫియాకు కూడా ఆమె మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని వంటి తాప్సీపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది కంగ‌నా. ఇప్పుడు తాజాగా.. దిల్లీలో పంజాబ్ రైతుల నిర‌స‌న వేళ ఇంట‌ర్నెట్ క‌ట్ చేసిన కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ పాప్ స్టార్ రిహానా కౌంట‌ర్ వేయ‌గా..

దీనికి మ‌ద్ధ‌తుగా తాప్సీ స్పందించింది. Bollywood war దీంతో కంగ‌నా మ‌రోసారి తాప్సీపై నిప్పులు చేల‌రేగింది. సూటిగా బి గ్రేడ్ న‌టి అంటూ విమ‌ర్శ‌లు చేసింది. బిగ్రేడ్ యాక్ట‌ర్ అంటూ ఫ్రీలోడ‌ర్‌.. దేశానికి అన‌వ‌స‌ర భారం అంటూ తాప్సీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కంగ‌నా. మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స్పందించినందుకు ఈ శిక్ష త‌ప్ప‌దు అని.. ట్వీట్ చేసింది కంగనా. అయితే దీనిపై తాప్సీ స్పందించింది. ఒక ట్వీట్ మీ ఐక్య‌త‌ను దెబ్బ‌తీస్తే, ఒక కామెడీ మీ విశ్వాసంపై సందేశాన్ని రేకెత్తిస్తే.. ఒక ప్ర‌ద‌ర్శ‌న మీ మ‌త విశ్వాసాన్ని బ‌య‌ట పెడితే అప్పుడు వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డానికి మీరు ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంది.. Bollywood war ఇత‌రుల‌కు భోద‌న చేయాల్సిన అవ‌స‌రం లేదు అని తాప్సీ కంగనాకు తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేసింది. ‌