మనం సైతం ‘కాదంబరి’ ని వరించిన ‘గ్రామోదయ బంధుమిత్ర’ పురస్కారం!!

తను చేస్తున్న నిరూపమన సేవలకుగాను.. ఇటీవలే 'గౌరవ డాక్టరేట్' అందుకున్న 'మనం సైతం కాదంబరి కిరణ్'ను... మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ప్రముఖ నటులు సోనూసూద్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వంటి ప్రముఖులు అందుకున్న 'గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం' కాదంబరిని వరించింది. 
 చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో... కొవిడ్ నిబంధనలకు లోబడి నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకులు సుబ్బరాజు, సీఈవో శ్రవణ్ మండప్, సలహాదారు డా.ప్రసాదరావు పాశం ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో కృష్ణమోహన్ రెడ్డి, వినోద్ బాల, వల్లభనేని అనిల్, రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు రామ్ నారాయణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ 150 వ జయంతిని పురస్కరించుకొని... దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 150 మందిని ఎంపిక చేశామని, వారిలో కాదంబరి ఒకరని 'గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ' వ్యవస్థాపకులు సుబ్బరాజు పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తన సేవా పయనంలో ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్న కాదంబరి...  ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తనకు ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు!!