జస్ట్ ఏ మినిట్’ మూవీ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్

రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’ దర్శకత్వం వహిస్తున్నారు. అర్షద్ తన్వీర్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అభిషేక్ రెడ్డి పచ్చిపాలా, నాజియా, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

‘ఏడుచాపల కథ’ సినిమా తో టెంప్ట్ రవి గా పరిచయం అయిన అభిషేక్ రెడ్డి. ఇప్పటికే తన వాక్చాతుర్యంతో  ‘జెన్యూన్ స్టార్’ అభిషేక్ గా  ప్రజాధారణ పొందాడు. అవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడూ చాపల కథ, వైఫ్ఐ చిత్రాల తర్వాత తాజా చిత్రం ‘జస్ట్ ఏ మినిట్‘ క్లీన్ కామెడీ కంటెంట్ తో మళ్ళి మన ముందుకు రానున్నారు. ప్రేక్షకులు బాగా ఆదరించిన ‘బులెట్ బండి సాంగ్’ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఎస్ కే బాజీ’ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్  వహించారు.

ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి టైటిల్ మ్యూజిక్ 17 ఏళ్ల రేయాన్ అనే బాలుడు మ్యూజిక్ ఇవ్వటం ఇంకో విశేషం. ఇప్పటికే, విడుదలైన మోషన్ పోస్టర్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ వైరల్ అవ్వుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ లో ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్ రీలిజ్ చేయనుండగా ప్రేక్షకులు నుంచి మంచి స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తున్నారు.  

నటి నటులు: అభిషేక్ రెడ్డి పచ్చిపాలా, నాజియా, జబర్దస్త్ ఫణి, వినీష, సతీష్ సరిపల్లి, నాగారం సునీల్, కార్తీక్ ధర్మపురి, ఖుషి, నాగిరెడ్డి తదితరులు.

టెక్నీకల్ టీమ్:
టైటిల్: జస్ట్ ఏ మినిట్
బ్యానర్: రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్
కార్తిక్ ధర్మపురి సమర్పించు
ప్రొడ్యూసర్స్ : Dr. ప్రకాష్ ధర్మపురి & రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్
ఎక్సక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూరి శ్రీ ఇనగంటి
డైరెక్టర్ : పూర్ణస్ యశ్వంత్
సినిమాటోగ్రాఫర్ : అమీర్
మ్యూజిక్ డైరెక్టర్ : SK బాజి
ఎడిటర్ : దుర్గానరసింహా
అసోసియేట్ ఎడిటర్ : కార్తీక్ ధర్మపురి
స్టోరీ మరియు స్క్రీన్ప్లే : అర్షద్ తన్వీర్
సింగర్స్ : మోహన భోగరాజు, సరాగ్

పీఆర్వో: మధు VR