జూనియర్ బాలకృష్ణ డెంగ్యూ వ్యాధితో మరణించాడు…

ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణని ఇమిటేట్ చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గోకుల్ సాయికృష్ణ కన్నుమూశాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతోన్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. జూనియర్ బాలయ్యగా మంచి పేరు తెచ్చుకున్న గోకుల్, తన అభిమాన హీరో బాలకృష్ణను కూడా కలిశాడు. మంచి భవిషత్తు ఉంటుంది అనుకున్న గోకుల్ ఇలా సడన్ గా మరణించడం నందమూరి అభిమానులనే కాకుండా బాలకృష్ణని కూడా బాధించింది. గోకుల్ మృతిపట్ల బాలకృష్ణ స్పందించాడు.

junior balakrishna gokul

మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ స్పందించాడు.