పోలీసులకు ప్రచార కర్తగా ఎన్టీఆర్

ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తారక్ సినిమా చేయనున్నాడు. సినిమాలతో పాటు తారక్ బుల్లితెరపై మరోసారి హోస్టింగ్ కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది.

JR NTR Campaign POLICE
JR NTR Campaign POLICE

ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్-1ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. త్వరలో జెమిని టీవీ షోలో ఒక షోను హోస్ట్ చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది ఇలా ఉంచితే.. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త అవతారమెత్తాడు. తెలంగాణ పోలీసులకు ఎన్టీఆర్ ప్రచారకర్తగా మారాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి తారక్ ప్రచారం చేయనున్నాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలకు మెసేజ్‌లు పెట్టి, ఫోన్ నెంబర్లు తీసుకుని వేధిస్తున్నారు కొంతమంది అగంతకులు. ప్రేమ పేరుతో వలలో వేసుకుని అభ్యంతర ఫొటోలను తెప్పించుకుంటున్నారు.

అభ్యంతకర ఫొటోలు పంపిన తర్వాత అమ్మాయిలను బ్లాక్ బెయిల్ చేస్తున్నారు. వీరి బారిన పడకుండా ఎన్టీఆర్ అవగాహన కల్పించనున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, అగంతకుల నుంచి మెసేజ్‌లు వస్తే స్పందించకుండా ఉండాలని ఎన్టీఆర్ అవగాహన కల్పించనున్నాడు.