Nithin: చెక్ టీమ్‌కు ఎన్టీఆర్ విషెస్‌..

Nithin: టాలీవుడ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం చెక్‌.. ఈ చిత్రం ఫిబ్ర‌వరి 26న విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెక్ చిత్ర‌యూనిట్‌కు విషెస్ తెలిపాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించిన చంద్ర‌శేఖ‌ర్ యేలేటి గారికి త‌నెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్ చేశాడు.. అలాగే చెక్ యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఇక నితిన్ ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన సినిమాలు వేరు.. చెక్ వేర‌ని.. ఇందులో త‌న న‌ట‌న వినూత్నంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపాడు.

Ntr Wishes

ఇక ఈ చిత్రంలోNithin నితిన్‌కు జోడీగా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్ల్‌గా న‌టించారు.. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని హామీ ఇచ్చారు చిత్ర‌బృందం. ఈ చిత్రాన్ని ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించ‌గా.. క‌ల్యాణీ మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అలాగే Nithinనితిన్ రంగ్‌దే చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వెన్నెల కిషోర్ ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా తాజాగా Nithinచెక్ టీమ్ కు వీడియో రూపంలో రంగ్‌దే టీం విషెస్ తెలిపారు.