నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న “జాలీ ఓ జింఖానా”

నవ్వులు పంచె వినోదానికి సిద్ధంగా ఉండండి! ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ కామెడీ మూవీ “జాలీ ఓ జింఖానా” భవానీ మీడియా ద్వారా నేటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది.

ప్రభుదేవాని హీరోగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ అలరిస్తుండగా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో మెరవనున్నారు.

వినూత్నమైన కథనంతో, ఆసక్తికరమైన పాత్రలతో “జాలీ ఓ జింఖానా”అభిమానులకి పూర్తి ఎంటర్టైన్మెంట్‌ను అందించనుంది.

నేటి నుంచి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న ఈ నవ్వుల పండగను మిస్ అవకండి.

https://www.aha.video/movie/jolly-o-gymkhana-telugu