Alluarjun: పుష్ప సినిమా అప్‌డేట్ చెప్పిన జానీ మాస్ట‌ర్‌..

Alluarjun: స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 13న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఫాస్ట్ గా జ‌రుగుతోంది. చిత్ర‌బృందం రాత్రింబ‌వ‌ళ్లు ఈ చిత్ర షూటింగ్ కోసం ప‌నిచేస్తున్నారు. మ‌రో రెండు నెలల్లో ఈ చిత్ర షూటింగ్ ముగించేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే తెలంగాణ‌, ఆంద్ర ప్రాంతాల్లో జ‌రిగిన విష‌యం తెలిసిందే.

johnny master

ఇప్పుడు తాజాగా Alluarjunఈ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. ఈ చిత్ర షూటింగ్ కోసం త‌మిళ‌నాడు వెళ్తున్న‌ట్లు ట్వీట్ చేశాడు జానీ. ఇటీవ‌లే జ‌రిగిన షూటింగ్‌లో యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించారు. ఇప్పుడు పాట చిత్రీక‌ర‌ణ కోసం సిద్ధం అయ్యాడు. అయితే త‌మిళ‌నాడులోని టెన్ కాశీలో Alluarjunఓ పాట‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లుగా జానీ మాస్ట‌ర్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ‌ప్ర‌సాద్ అదిరిపోయే సాంగ్స్ ఇస్తున్న‌ట్లు చిత్ర‌బృందం నుంచి టాక్‌. ఇప్ప‌టివ‌ర‌కు చిత్రాల‌కు చేసిన మ్యూజిక్ ఒక ఎత్తు.. ఇప్ప‌డు ఈ చిత్రానికి మ‌రింత శ్ర‌ద్ద తీసుకుని అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేశాడ‌ట దేవీ. ఇక ఈ చిత్రంలో Alluarjunబ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.