
శ్రీ ఇందిరా కంబైన్స్, యాపిల్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా అల్లం నాగార్జున, జగన్మోహన్ నిర్మాతలుగా మళ్లీ ఏలూరి దర్శకత్వంలో ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జిగేల్. త్రిగున్, మేఘ చౌదరి జంటగా పోసాని కృష్ణ మురళి, శియజి షిండే, రఘుబాబు, పృథ్వీరాజ్, ముక్కు అవినాష్, ఆటో రాంప్రసాద్ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే నాగార్జున అల్లం అందించగా వాసు డిఓపిగా, ఆనంద మంత్ర సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే…
కథ:
లాకర్ టెక్నీషియన్ గా పనిచేస్తూ దొంగతనాలు చేస్తుంటాడు త్రిగున్. తనతో డబ్బున్న అమ్మాయిల కొన్ని రోజులపాటు నటించి తర్వాత ఒక దొంగతనం చేస్తూ త్రిగున్ కు దొరికిపోతుంది మేఘ చౌదరి. తద్వారా ఇద్దరు దొంగలు అని ఒకరికి ఒకరు తెలిసిన ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా వారికి ఒక లాకర్ గురించి తెలుస్తుంది. ఆ లోకంలో ఎంతో నిధి ఉందని తెలుసుకున్న మేఘ చౌదరి త్రిగున్ సహాయంతో ఆ లాకర్ను తెరవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అసలు ఆ లాకర్ ఎవరిది? రాకను చివరిగా ఓపెన్ చేస్తారా లేదా? చేసాక ఆ ఒక్కరిలో ఏముంటుంది? వీరి జీవితాల్లోకి అసలు ఆ లాకర్ ఎలా వచ్చింది? పోసాని కృష్ణ మురళి ఆ లాకర్ ఓపెన్ చేయడానికి వీరికి ఏ విధంగా సహాయపడతాడు? ఆ లాకర్ కు హీరోయిన్ కు సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
వర్సటైల్ యాక్టర్ త్రిగున్ తన నటనతో దొంగగా తన పాత్రను పోషిస్తూ కథకు మూల స్తంభల్లా నిలిచాడు. అదేవిధంగా నటి మేఘ చౌదరి తన గ్లామర్ తో అలాగే నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా నటించారు. పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, పృథ్వీరాజ్, ముక్కు అవినాష్, రాంప్రసాద్ తమ పాత్ర పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్ గా నిలిచారు. అలాగే ఇష్టం నటించిన ఇతర నటీనటులు తమ పాత్రకు తగ్గట్లు నటించారు. ముఖ్యంగా ముక్కు అవినాష్ ఇంకా రాంప్రసాద్ కాంబినేషన్లోని కామెడీ అలాగే పోసాని కృష్ణ మురళి చేసిన కామెడీ చిత్రంలో ఎంత బాగా పండేలా చేశాయి.
సాంకేతిక విశ్లేషణ:
కథను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి తన అనుకున్న అవుట్ పుట్ ను తీసుకు రావడంలో దర్శకుడు మంచి విజయం పొందాడు. నిర్మాణ విలువలలో ఎక్కడ కాంప్రమైస్ కానట్లు అర్థమవుతుంది. సినిమాలో సీన్లకు తగ్గట్లు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అలాగే సిచువేషన్ కి తగ్గట్లు పాటలు చిత్రానికి బోనస్గా నిలిచాయి. కామెడీ ఇంకా డ్రామాకు తగ్గట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్ఫెక్ట్గా సింగ్ అయింది. డబ్బింగ్ లో ఎక్కడ కూడా ఎటువంటి తడబాటు లేకుండా జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా కలరింగ్, ఇంకా లొకేషన్స్ లో రిచ్నేస్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, నటన, కామెడీ, బిజిఎం
మైనస్ పాయింట్స్ :
కథ కొంచెం స్లోగా ఉండటం
సారాంశం :
మంచి డ్రామా కామెడీ ఇంకా యాక్షన్ తో కుటుంబ సభ్యులతో కలిసి చూసి సరదాగా ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంది.