Jhanvi Kapoor: ఒక “కిస్ ఇస్తావా” అడిగిన అభిమాని.. జాన్వీ రెస్పాన్స్ చూడండి!

Jhanvi Kapoor: దివంగ‌త ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ త‌న న‌ట‌న‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆమె సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో హ‌ల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానుల‌తో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చ‌టించారు. త‌న‌కు ఇష్ట‌మైన వాటి గురించి వారితో పంచుకున్నారు. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె బ‌దులిచ్చారు. ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని త‌న‌ని ముద్దు అడిగాడు.. నాకు ముద్దిస్తావా? అని అడిగాడు.

jhanvi latest

దీంతో ఆ ప్ర‌శ్న‌కు జాన్వీ స్పందిస్తూ.. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లేదు అంటూ చిలిపిగా స‌మాధానం ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఆమె ప్ర‌స్తుతం న‌టించిన ‌గుడ్ ల‌క్ జెర్రీ చిత్రం షూటింగ్‌ను ఇటీవ‌లే పూర్తి చేశారు. ఈ చిత్రానికి సిద్దార్థ్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో.. ఆనంద్ ఎల్‌.రాయ్ ఈచిత్రాన్ని నిర్మించారు. అలాగే దోస్తానా-2 చిత్రంలోనూ జాన్వీ న‌టిస్తుంది.