శ్రీదేవి సొంత కూతురినే నమ్మదా?

అతిలోక సుందరి కూతురిగా ధడక్ సినిమాతో జాన్వీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సైరాట్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ లో బాగానే ఆడింది. దీంతో జాన్వీకి బాలీవడ్ లో మంచి డెబ్యూ దొరికింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో నార్త్ ప్రేక్షకులని మెప్పించిన జాన్వీ, ప్రస్తుతం గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. ఎప్పుడు అమ్మ శ్రీదేవి టాపిక్ వచ్చినా ఎమోషనల్ అయ్యే జాన్వీ, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్ పెళ్లి సమయం వస్తే కంజీవరమ్ చీరను కట్టుకోని సాంప్రదాయ పద్దతిలో తిరుపతిలోని వెంకన్న స్వామి సన్నిధిలోనే వివాహం చేసుకుంటానని చెప్పింది. తనకి కాబోయే వాడి గురించి కూడా చెప్పిన జాన్వీ, తాను చేసుకోబోయే వాడిలో మంచి టాలెంట్ ఉండాలని, అతని నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలని, తాను చేసే పని పట్ల కాబోయే వాడికి కూడా అంకితభావం ఉండాలని, అప్పుడే ఇద్దరి మధ్య బాండింగ్ బలంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ పెళ్లి టాపిక్ లో శ్రీదేవి గురించి మాట్లాడిన జాన్వీ, తనపై తన తల్లి శ్రీదేవికి నమ్మకం ఉండేది కాదని, తాను ఎక్కడ ప్రేమలో పడతానని తన తల్లి శ్రీదేవి భయపడుతూ ఉండేదని, పెళ్లి వయసు వచ్చినపుడు తానే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తల్లి శ్రీదేవి ఎప్పుడూ చెబుతూ ఉండేదని జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న వాళ్లు మాత్రం ఒకింత ఆశ్చర్య పోతున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీదేవి, సొంత కూతురికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి? జాన్వీ అంత అమాయకురాలా? లేక ఆమె అందరినీ అంత ఈజీగా నమ్మేసి మోసపోతుందనే భయం శ్రీదేవికి ఉండేదా అని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలకి సమాధానం చెప్పడానికి శ్రీదేవి ఇప్పుడు లేదు కానీ ఇప్పుడిప్పుడే కెరీర్ సెట్ చేసుకునే పనిలో ఉన్న జాన్వీ, అమ్మలాగా టాప్ హీరోయిన్ అవుతుందని భావించిన వాళ్లు మాత్రం కెరీర్ చూసుకోకుండా ఇప్పుడే పెళ్లి టాపిక్ ఎందుకని డిజప్పాయింట్ అవుతున్నారు.