నాలుగు భాష‌ల్లో జెట్టి టైటిల్ లోగో లాంఛ్

వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది . ఈ మూవీ టైటిల్ లోగో లాంఛ్ చేసింది టీం. తెలుగు ,తమిళ్, మ‌ళ‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో టైటిల్ లోగో ని విడుద‌ల చేసారు చిత్ర యూనిట్. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ, నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక.

మత్స్యకారుల నేపథ్యం లో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం ను తెరమీదకు తెస్తున్న చిత్రంజెట్టి నిలుస్తుంది. ప్రపంచీక‌ర‌ణ తో మారుతున్న జీవ‌న‌శైలి లో తాము న‌మ్ముకున్న స‌ముద్రం మీద ఆధార ప‌డుతూ అల‌లతో పోటీ ప‌డ‌తూ పొట్ట బోసుకుంటున్న జీవితాల‌ను అంతేస‌హాజంగా తెర‌మీద ప‌రిచాడు ద‌ర్శ‌కుడు . అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయ్, అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం “జెట్టి”. నంద‌త శ్వేత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో కృష్ణ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.