Jayasudha: గుర్తు ప‌ట్టలేనంత‌గా స‌హ‌జ‌న‌టి.. నెటిజ‌న్స్ షాక్‌!

Jayasudha: స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ తెలుగు తెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకుంది. హీరోయిన్‌గానే కాకుండా అనేక ర‌కాలుగా ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశారు జ‌య‌సుధ‌. ఇప్పుడున్న స్టార్ హీరోల‌కు త‌ల్లిగా చేసి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక కొత్త జ‌న‌రేష‌న్ హీరోల‌కు అమ్మ‌మ్మ‌, నాన్న‌మ్మ పాత్ర‌లు చేస్తూ.. కానీ ఏ పాత్ర చేసిన త‌న‌దైన మార్క్‌ను సంపాదించుకుంటుంది Jayasudha జ‌య‌సుధ‌. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో ఆమె న‌ట‌న అద్భుతం అనే చెప్పాలి. కాగా ఇటీవ‌లే కాలంలో ఆమె సినిమాల్లో క‌నిపించేట్లేదు. తాజాగా ఆమె ఒక సీరియ‌ల్ ప్ర‌మోష‌న్ కోసం వీడియోను విడుద‌ల చేశారు. ఆ వీడియోలో జ‌య‌సుధ లుక్ చూసి అంతా షాక్‌కు గుర‌య్యారు.

Jayasudha Latest Look

అందులో ఆమె తెల్ల జుట్టుతో క‌నిపిస్తున్నారు. చాలా స‌న్న‌గా కూడా అయిపోయారు. Jayasudhaఆమె ముఖంలో కూడా క‌ళ త‌ప్పింది. ఇక దీంతో అమె అభిమానులు అస‌లేం జ‌రిగింది అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. స‌హాజ‌న‌టి కాస్త ఇలా అయ్యారేంటి.. ముందు ముందు ఆమెను వెండితెర‌పై చూడ‌లేమా అంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. Jayasudhaజ‌య‌సుధ మ‌ళ్లీ మునుప‌టి ఉత్సాహంతో సినిమాలు చేయాల‌ని ఆమె ఆరోగ్యంగా మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రావాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక తాజాగా వీడియోలో జ‌య‌సుధ జాన‌కి క‌ల‌గ‌న‌లేదు అనే సీరియ‌ల్ గురించి మాట్లాడారు. ఈ సీరియ‌ల్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు.. జాన‌కీ క‌ల‌గ‌న‌లేదు.. రాముని స‌తికాగ‌ల‌న‌ని ఏనాడు అనే సాంగ్ తాను, శోభ‌న్‌బాబు క‌లిసి న‌టించిన చిత్రంలోనిది అంటూ తెలిపింది జ‌య‌సుధ‌. అప్ప‌ట్లో ఈ సాంగ్ షూటింగ్‌ను ఊటీలో చేశామ‌ని.. ఇందులో త‌న కాస్ట్యూమ్స్ కూడా ప్రేక్ష‌కుల‌కు ఎంతో న‌చ్చాయ‌ని అన్నారు. ఇప్పుడు ఆ సాంగ్ పేరుతో సీరియ‌ల్ రాబోతుంద‌ని.. సీరియ‌ల్ టీంకు అభినంద‌న‌లు తెలిపింది Jayasudhaజ‌య‌సుధ‌.