తనపై వస్తున్న నెపోటిజమ్ విమర్శలకు సమాధానం ఇచ్చిన జాన్వీ కపూర్

సుశాంత్ మృతి అనంతరం బాలీవుడ్ లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక నెపోటిజమ్ అనే కామెంట్స్ తో స్టార్స్ కిడ్స్ తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇక అందులో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ కూడా ఇబ్బందులు పడుతోంది. ఆమె నటించిన గుంజన్ సక్సేనా బయోపిక్ మరికొన్ని రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాను కరణ్ జోహార్ నిర్మించడంతో జాన్వీ కపూర్ పై కూడా నెపోటిజమ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే తాను మాత్రం అలాంటి విషయంలో ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. కేవలం ఒక నటిగా తాను ఎంతగా శ్రమిస్తున్నానో తనకు తెలుసని బ్యాక్ గ్రౌండ్ తో అవకాశాలు ఈజిగానే అందుకున్నప్పటికి ఒక విషయాన్ని మాత్రం బలంగా నమ్ముతానని అన్నారు. ఆడియెన్స్ ని ఆకట్టుకుంటేనే ఇక్కడ పని ఉంటుంది. వాళ్ళు ఆదరించకపోతే ఏమి ఉండదు. ఇక నాపై వస్తున్న విమర్శలకు ఎవరిని కూడా నేను నింధించాలని అనుకోవడం లేదని జాన్వీ కూల్ గా సమాధానం ఇచ్చింది.