హాలీవుడ్ నటి, మరియు మాజీ గ్లామర్ మోడల్, మార్గరెట్ నోలన్ కన్నుమూశారు. 1964 జేమ్స్ బాండ్ చిత్రం ‘గోల్డ్ ఫింగర్’ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్న ఆమె టైటిల్ సీక్వెన్స్‌లో బంగారు-పెయింట్ మోడల్ గా ప్రసిద్ది చెందారు. ఇక ఆమె అక్టోబర్ 5న మరణించారు. ఈ విషయం ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలియడంతో జేమ్స్ బాండ్ అభిమానులు షాక్ అవుతున్నారు.
నోలన్ కుమారుడు ఆస్కార్ డీక్స్ 76 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్లు ధృవీకరించారు. దర్శకుడు ఎడ్గార్ రైట్ ట్విట్టర్లోకి నోలన్ మరణ వార్తను గురించి తెలుసుకొని హృదయపూర్వక నివాళులర్పించారు. “60 వ దశకంలో ఆమె ఒక స్థిరమైన నటిగా ఎన్నో విభిన్నమైంక్ పాత్రల్లో నటించింది. బీటిల్స్ తో కలిసి కనిపించింది, బాండ్లో ఐకానిక్‌కు మించినదని చెప్పవచ్చు. మరియు ‘క్యారీ ఆన్’ తారాగణంలో కూడా ఒక ముఖ్యమైన భాగం” అని రైట్ ట్వీట్ చేశాడు.