Jagapathibabu: హ్యాపీ బ‌ర్త్‌డే జ‌గ్గుభాయ్‌.. చుంచుమామ పోస్ట‌ర్ రిలీజ్‌!

Jagapathibabu: నేడు ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం నుంచి పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం మ‌హాస‌ముద్రం. సిద్ధార్థ్‌, శ‌ర్వానంద్‌లు హీరోలుగా.. ఆర్ఎక్స్100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా.. ఈ రోజు జ‌గ్గుభాయ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌హాస‌ముద్రం టీమ్ Jagapathibabu జ‌గ‌ప‌తిబాబు ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు చుంచు మామ పాత్ర పోషిస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌లో Jagapathibabu జ‌గ‌ప‌తిబాబు మాస్ లుక్ క‌నిపించ‌గా.. ఎంతో ఆక‌ట్టుకుంది ఈ ఫ‌స్ట్‌లుక్‌. ఇక ఈ చిత్రంలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రం అగ‌ష్టు 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు… నేడు Jagapathibabu జ‌గ‌ప‌తిబాబు గారి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా.. టీఎఫ్‌పీసీ త‌ర‌పున ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.‌