

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
చందూ మొండేటి మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు భాస్కర్ గారిని నా కెరీర్ ప్రారంభంలో చూశాను. స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తుంటే బొమ్మరిల్లు భాస్కర్‌ని చూస్తుండేవాడిని. ఆయన అప్పట్లో సివిక్ కారుని కొన్నారు. ఆ కారుని చూసే నేను కూడా అదే కొన్నాను. సిద్దు అంటే మా ఇంట్లో వారందరికీ చాలా ఇష్టం. సిద్దుతో సినిమా ఎప్పుడు చేస్తావ్ అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటారు. వైష్ణవి మరింత ముందుకు వెళ్లాలి. జాక్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కార్తిక్ దండు మాట్లాడుతూ .. ‘ప్రసాద్ గారు, బాపీ గారు నన్ను 2019 నుంచి లాక్ చేశారు. ఇది నాకు హోం బ్యానర్ లాంటిది. నాకు విరూపాక్షతో అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి థాంక్స్. బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి గొప్ప చిత్రాలను తీశారు. ఆయన రైటింగ్ నాకు చాలా ఇష్టం. సిద్దు సినిమా అంటే అందరూ మినిమం గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు. ఆ ఇమేజ్ రావడం అంత సులభం కాదు. జాక్ చిత్రానికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ .. ‘నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ చూశాను. పరుగు, ఆరెంజ్ ఇలా బొమ్మరిల్లు భాస్కర్ గొప్ప చిత్రాల్ని తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఓ సిగ్నేచర్ ఉంటుంది. మా సిద్దుని టిల్లు గాడిలానే చూశారు. కానీ దాని కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. జాక్‌తో అది మరింతగా ఉంటుంది. వైష్ణవికి ఈ చిత్రం మరింత సక్సెస్ తెచ్చి పెట్టాలి. జాక్ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘జాక్ ఈవెంట్‌కు వచ్చిన యంగ్ డైరెక్టర్లకు థాంక్స్. జాక్ మంచి చిత్రం అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవువతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ .. ‘జాక్ చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ ప్రయాణం నా జీవితాంతం గుర్తుంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి అద్భుతమైన డైరెక్టర్‌తో పని చేయడం లక్కీ. ఆయన హీరోయిన్ పాత్రలను అద్భుతంగా రాస్తుంటారు. నాకు ఇందులో ఓ మంచి కారెక్టర్ లభించింది. నా పర్ఫామెన్స్‌తో డైరెక్టర్‌లను సంతృప్తి పర్చాలని అనుకుంటాను.. వారి మొహంలో నవ్వు చూడాలని అనుకుంటాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి థాంక్స్. విజయ్ గారు ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా మలిచారు. సిద్దు గారు అద్భుతమైన కో స్టార్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనకు సినిమానే ప్రాణం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. మా జాక్ చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ .. ‘బొమ్మరిల్లు సినిమా చూసిన తరువాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం. బొమ్మరిల్లు సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశాను. మా సిద్దుతో కలిసి ఇలా బొమ్మరిల్లు భాస్కర్ గారు సినిమా చేయడం.. ఆ ఈవెంట్‌కు నేను రావడం ఆనందంగా ఉంది. టిల్లు సినిమాలో సిద్దు ఎంతగా ఎంటర్టైన్ చేశాడో జాక్‌లో అంతకంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తాడు. హాయిగా నవ్వుకునేలా జాక్ చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 10న జాక్ చిత్రం రాబోతోంది. మా సిద్దుకి భారీ ఓపెనింగ్స్‌కి ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ .. ‘మా ఈవెంట్‌కు వచ్చిన చందూ మొండేటి, కార్తిక్ వర్మ, కళ్యాణ్ శంకర్‌లకు థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత ప్రసాద్ గారికి థాంక్స్. బాపీతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. కెమెరామెన్ విజయ్ చక్రవర్తితో మళ్లీ చాలా ఏళ్ల తరువాత కలిసి పని చేశాను. నవీన్ నూలితో ఫస్ట్ టైం పని చేశాను. పనిలో తన విశ్వరూపాన్ని చూపించాడు. మూవీని అద్భుతంగా కట్ చేశాడు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది. అచ్చు, సురేష్ బొబ్బిలి పాటలు బాగుంటాయి. శామ్ సీఎస్ ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. నా డైరెక్షన్ టీం ఇప్పటికీ సినిమాకి సంబంధించి ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంది. వైష్ణవి అద్భుతమైన నటి. ఎలాంటి సీన్‌ను అయినా సులభంగా నటించేశారు. సిద్దులో తెలియని స్పార్క్‌ని ఎప్పుడో చూశాను. ఇప్పుడు అది వైల్డ్ ఫైర్‌లా ఉంటుంది. సిద్దులో చాలా స్పాంటేనిటీ ఉంటుంది. సిద్దుకి సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. సినిమాకు పని చేసిన, నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జాక్ అనేది మన అందరి కథ. ఒక రాయి, ఒక శిల్పానికి.. ఒక తాబేలు, కుందేలు.. ఓ ఎయిర్ బస్, ఎర్ర బస్సుకి మధ్య జరిగే కథ. మా చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. ‘జాక్ ఈవెంట్‌కు వచ్చిన చందూ మొండేటి, కార్తీక్, కళ్యాణ్ శంకర్‌కి థాంక్స్. విరూపాక్ష నన్ను చాలా భయపెట్టింది. చందూ మొండేటి నాకు ఓ సినిమా బ్యాలెన్స్ ఉన్నారు. కళ్యాణ్ శంకర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. నాగవంశీ అన్న వచ్చి సపోర్ట్ చేసినందుకు థాంక్స్. టిల్లు స్క్వేర్ తరువాత ఎలాంటి కథ చేయాలని చాలా ఆలోచించాను. అదే మీటర్‌లో ఉండాలి కానీ.. సేమ్ స్టోరీలా ఉండొద్దని అనుకున్నాను. ఆ టైంలోనే జాక్ కథను విన్నాను. టిల్లు స్క్వేర్ తరువాత ఇదే పర్ఫెక్ట్ సినిమా అని నాకు అనిపించింది. మా సినిమా కోసం అచ్చు, సురేష్ బొబ్బిలి పాటలు చక్కగా ఇచ్చారు. శామ్ సీఎస్, వైదీ ఈ చిత్రానికి మంచి ఆర్ఆర్ ఇచ్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఓ ఎడిటర్ లేకుంటే డైరెక్టర్లకు కాళ్లు, చేతులు ఆడవు. జాక్ చిత్రాన్ని ఆయన చక్కగా కట్ చేశారు. వైష్ణవి ఏవీ చూసినప్పుడు నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయి. బేబీ చూసిన తరువాత జాక్ హీరోయిన్ ఈమే అని ఫిక్స్ అయ్యాం. వైష్ణవి చాలా గొప్ప నటి. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. బొమ్మరిల్లు భాస్కర్ గారితో ఆరెంజ్ సినిమాను చేశాను. కానీ ఆ టైంలో ఎక్కువగా మాట్లాడే టైం దొరకలేదు. ఈ జాక్ కోసం ఆయనతో చాలా ట్రావెల్ చేశాను. ఆయన 24 గంటలు సినిమా కోసమే ఆలోచిస్తుంటారు. టిల్లు, టిల్లు స్క్వేర్‌తో నాకు ఓ కామెడీ టైమింగ్ ఏర్పడింది. ఆ టైమింగ్‌ను జాక్‌లో మిస్ అవ్వకుండా చేశారు బొమ్మరిల్లు భాస్కర్. నాకు జాక్ చిత్రంలో ఎంతో ఫ్రీడం ఇచ్చారు. అంతలా నన్ను సపోర్ట్ చేసిన ఆయనకు థాంక్స్. విజయ్ చక్రవర్తి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. అవినాష్ గారి ఆర్ట్ వర్క్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. జాక్ చిత్రం రెండు వందల శాతం అందరికీ నచ్చుతుంది. ఎక్కడా ఎవ్వరినీ నిరాశపర్చదు. జాక్ ఏప్రిల్ 10న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.