Tollywood: మామ వ‌చ్చేస్తున్న‌.. జాతిర‌త్నాలు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రౌడీ ర‌త్నం చీఫ్‌గెస్ట్‌!

Tollywood: న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం జాతి ర‌త్నాలు. స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ నిర్మిణంలో.. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ భాగంగా రేపు వ‌రంగ‌ల్‌లో ప్రీరిలీజ్ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. దీనికి రౌడీ ర‌త్నం విజ‌య్‌దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నాడు.

Prerelease event

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. Tollywood చిత్ర‌బృందం ఓ ఫ‌న్నీ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్లో ముగ్గురు జాతి ర‌త్నాలను విజ‌య్ దేవ‌ర‌కొండ వెంబ‌డిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి పోస్ట‌ర్ల్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మానందం, బ్ర‌హ్మాజీ, ముర‌ళీ శ‌ర్మ‌, సీనియ‌ర్ న‌రేశ్ త‌దిత‌రులు ఈ Tollywood చిత్రంలో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ర‌థ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. ఇందులో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తుంది.