గల్లీ రౌడి ఐటమ్ సాంగ్ ప్రోమో అదిరింది…

యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం నుండి “పుట్టినే ప్రేమ” పాటను విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి “చాంగురే” ఐటమ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. చాంగురే ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జూలై 21న విడుదల చేయనున్నారు.

ఈ పాటను మంగలి, దత్తు కలసి ఆలపించారు.. ఈ చిత్రానికి సాయిరాం రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో కు మంచి స్పందన వస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను కోనవెంకట్ సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్, ఎంవివి ఫిలిమ్స్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.