బాలీవుడ్ ఇస్మార్ట్ శంకర్.. సిద్ధమేనా?

టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ కాబోతోందని గత ఏడాది నుంచి భారీ స్థాయిలో రూమర్స్ వస్తున్నాయి. సక్సెస్ లేక సతమతమవుతున్న హీరో రామ్ కి అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా ఆ ఒక్క సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చి మెగాస్టార్ ఆచార్యను పట్టేశాడు.

అంతమంది లెజెండ్స్ కి యూ టర్న్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ తనకు కూడా మంచి హిట్ ఇస్తుందని బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక బడా నిర్మాణ సంస్థ త్వరలోనే ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ ఒక టాక్ అయితే నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.