ఇస్మార్ట్ హిట్ కొట్టి వంద రోజులు, టీవిలో కూడా సూపర్ హిట్టే

ఈ ఏడాది తెలుగు హిట్ సినిమాల్లో మంచి జోష్ క్రియేట్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే ఠక్కున ఇస్మార్ట్ శంకర్ అనే సమాధానం వినిపిస్తుంది. పూరి, రామ్ కలయికలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. మణిశర్మ మ్యూజిక్, పూరి డైరెక్షన్, రామ్ పెర్ఫార్మెన్స్, హీరోయిన్స్ గ్లామర్ అన్నీ కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాని అంత పెద్ద హిట్ అయ్యేలా చేశాయి. జులై 19న రిలీజ్ అయిన ఈ సినిమా ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకోనుంది.

ismart shankar

ఈ సందర్భంగా రామ్ అండ్ పూరి జగన్నాథ్ లు ఇస్మార్ట్ శంకర్ గురించి ట్వీట్స్ చేశారు. పూరి అయితే రామ్ తో మళ్లీ కలిసి వర్క్ చేయాలనుందని పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు కాబట్టి పూరి కథ రాయడమే మిగిలింది. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్స్ లోనే కాదు టీవీల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమా, 16.63 TRP రేటింగ్ ని సాధించి వన్ ఆఫ్ ది హైయెస్ట్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.