కన్నడ బ్యూటీ నభా ఇస్మార్ట్ గిఫ్ట్ అదిరింది

సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ, రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. పూరి, రామ్ కలయికలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో సివిల్ ఇంజనీర్ చాందినిగా కనిపించిన నభా నటేష్, వరంగల్ యాసలో దుమ్ములేపింది. గ్లామర్ గా కనిపిస్తూనే క్యూట్ గా మాట్లాడిన నభా నటేష్, యూత్ కి హార్ట్ బీట్ ని పెంచింది. తన క్రేజీ యాక్టింగ్ తో సినీ అభిమానులని ఆకట్టుకున్న నభా, ఇప్పుడు తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రవితేజ నటిస్తున్న డిస్కో రాజా మూవీలో మెయిన్ లీడ్ గా చేస్తోంది.

వీలుచిక్కినప్పుడల్లా గ్లామర్ ఫొటోస్ తో పాటు ట్రెడిషనల్ లుక్ లో ఉండే ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసే నభా నటేష్, లేటెస్ట్ గా తాను మెర్సిడస్ బెంజ్ కారు తో దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలో వర్స్ కి గ్రాట్టిట్యూ డ్ చెబుతూ ఈ పిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమా కారణంగానే ఈ కార్ వచ్చింది. తనకి తానే ఈ కార్ ని ప్రెజెంట్ చేసుకున్న నభా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.