చిరు టీజర్‌కి రాంచరణ్ వాయిస్ ఓవర్?

చిరు-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాంచరణ్ పక్కన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం 4.05కి విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ఇవాళ ట్వీట్ చేశాడు. దీంతో మెగా అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

varuntej about acharya teaser

కొరటాల శివ ట్వీట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రామిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చిరు ట్వీట్ చేయగా.. టీజర్ కోసం ఎదురుచూస్తున్నట్లు రాంచరణ్ ట్వీట్ చేశాడు. ఇక ఆచార్య టీజర్ అప్డేట్‌పై మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. ఈ సందర్భంగా ‘చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా టీజర్‌కి.. బయట టాక్’ అంటూ ఉన్న ఒక మీమ్ పోస్టర్‌ని వరుణ్ తేజ్ పోస్ట్ చేశాడు.