ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్?

బిగ్‌బాస్-4 ఫైనల్ వీక్స్‌కు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో ముగియనున్న క్రమంలో ఈ వారం ఎలిమినేష్ ప్రక్రియ కీలక కానుంది. గత వారం అవినాష్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వీరిలో అఖిల్‌కు టికెట్ టూ ఫినాలే మెడల్ దక్కడంతో డైరెక్టుగా ఫైనల్ వీక్‌కు చేరుకున్నాడు. దీంతో ఈ వారం అతడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఈ వారం మిగతా ఐదుగురిని డైరెక్టర్‌గా తానే నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.

BIGBOSS4

దీంతో ఈ వారం నామినేషన్స్‌లో అభిజిత్, సోహెల్, మోనాల్, హారిక, అరియానా ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే ఇక హౌస్‌లో ఐదుగురు మాత్రమే ఉండనున్నారు. దీంతో వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు. టాప్-5లో ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు, ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఫీమేల్ కంటెస్టెంట్లలో హారిక, మోనాల్, అరియా ఎలిమినేషన్‌లో ఉన్నారు.

ఇక మేల్ కంటెస్టెంట్లలో సోహెల్, అభిజిత్ నామినేషన్లలో ఉన్నారు. అభిజిత్‌కు ఎలాగూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. దీంతో అతడు ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఇక సోహెల్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో అతడు కూడా సేవ్ అయ్యే అవకాశముంది. ఇక మోనాల్‌కు ఓట్లు పడకపోయినా ఆమె ఉంటే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనే భావన ఉంది. దీంతో నిర్వాహకులు మోనాల్‌ను హౌస్ నుంచి పంపించే అవకాశాలు లేవు.

ఇక మిగిలిన అరియానా, హారికలలో ఒకరు వచ్చేవారం ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. వారిద్దరిలో అరియానా సేవ్ అవుతుందని, హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.