సమరానికి సిద్దమైన బెంగళూరు హైదరాబాద్

ఐపీఎల్ 2020లో మొదటి రెండు మ్యాచులు థ్రిల్లర్ సినిమాని తలపించే రేంజులో జరిగాయి. ఆ జోష్ ని మరింత పెంచుతూ ఈరోజు మూడో మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. బెంగళూరుకి హైదరాబాద్ కి మధ్య జరగున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూసే ముందు. ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ ఫేస్ ఆఫ్ ఒకసారి చూద్దాం. ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు 14సార్లు తలపడగా, అందులో సన్ రైజర్స్ 7సార్లు, రాయల్ చాలెంజర్స్ 6సార్లు గెలిచారు. ఒక మ్యాచ్ రిజల్ట్ లేకుండా టై అయ్యింది. గత అయిదు మ్యాచుల్లో హైదరాబాద్ 3సార్లు గెలవగా, బెంగళూరు 2సార్లు గెలిచింది. ఇక ఆడిన ఫస్ట్ మ్యాచులో ఎవరి రికార్డు ఎలా ఉందో చూస్తే, గత 5 సీజన్స్ లో సన్ రైజర్స్ 2సార్లు విజయంతో సీజన్ స్టార్ట్ చేస్తే, మూడుసార్లు ఓటమితో మొదలు పెట్టారు. బెంగళూరు రికార్డు ఇదే రికార్డుని మైంటైన్ చేస్తుంది. ఇక కీ ప్లేయర్స్ విషయం చూద్దాం.

బెంగళూరు కీ ప్లేయర్స్

బెంగళూరు రాయల్ ఛాలెంజెర్స్ టీంకి బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. కోహ్లీ, డీవీలర్స్ లాంటి స్టార్ బ్యాట్సమెన్ బెంగళూరుని ముందుండి నడిపిస్తున్నారు. ఒకరు ఫెయిల్ అయినా ఇంకొకరు ఈ టీంకి హ్యుజ్ సపోర్ట్ ఇస్తూ ప్రత్యర్థి బౌలింగ్ కి పరీక్ష పెడుతున్నారు. ఒకవేళ ఈ ఇద్దరికీ ఆరన్ ఫించ్ కూడా తోడైతే బెంగుళూరుని ఆపడం కష్టమే. బ్యాటింగ్ లో ఈ ముగ్గురూ రాణిస్తుంటే బౌలింగ్ లో డేల్ స్టయిన్ అదరగొట్టాడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకూ 96 వికెట్స్ తీసిన స్టయిన్, 100 వికెట్స్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. 140 స్పీడ్ ని కాన్స్టాంట్ గా మైంటైన్ చేసే స్టయిన్ కి, ఇండియన్ పేసర్ ఉమేష్ యాదవ్ కూడా తోడై ఆపోజిట్ టీమ్స్ ని ఇరుకున పెట్టడానికి సిద్దమవుతున్నాడు. 148 వికెట్స్ తీసిన ఉమేష్ బెంగుళూరు బౌలింగ్ ని పటిష్టం చేశాడు. ఈ ఇద్దరే కాకుండా మొయిన్ అలీ, చాహల్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు కూడా బెంగళూరుకి అండగా నిలవనున్నారు.

హైదరాబాద్ కీ ప్లేయర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ కి కేన్ విలియమ్స్ ఈజ్ ది ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. క్లాస్ గా ఆడే ఈ ప్లేయర్, అవసరమైతే విధ్వంసకర ఆట కూడా ఆడగలడు. కేన్ కి కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా తోడైతే సన్ రైజర్స్ బ్యాటింగ్ ధాటిని తట్టుకోవడం ఏ బౌలర్ కైనా కష్టమే. ఈ ఇద్దరికీ యంగ్ ఇండియన్ ప్లేయర్ మనీష్ పాండే స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వనున్నాడు. తనదైన రోజున ఎలాంటి బంతిని అయినా బౌండరీ చేర్చగల మనీష్ పై హైదరాబాద్ జట్టు చాలా ఆశలే పెట్టుకుంది. ఇండియన్ అండ్ ఫారిన్ ప్లేయర్స్ కి మంచి బ్యాటింగ్ లైనప్ మైంటైన్ చేస్తున్న సన్ రైజర్స్ కి బౌలింగ్ లైనప్ కూడా అంతే బలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ బౌలింగ్ కి నాయకత్వం వహిస్తుండగా… అతనికి నబి, సిద్దార్థ్ కౌల్ రూపంలో మంచి సపోర్ట్ ఉంది.

స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్ పోటాపోటిగానే సాగుతుంది. చివరి వరకూ మ్యాచ్ ని ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కష్టమే. కోహ్లీ- కేన్, డీవీలర్స్-వార్నర్, స్టయిన్-భువనేశ్వర్… లాంటి ప్లేయర్స్ తమ పెర్ఫార్మెన్స్ తో ఈరోజు రిజల్ట్ ని ఎలా ఛేంజ్ చేస్తారో చూడాలి.