చంద్ర బాబు ప్రమాణ స్వీకారంకు ప్రముఖ సినీ నటులకు ఆహ్వానం

ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా జరుకానున్నారు. ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు కోరారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా విశిష్ట అతిథిగా రానున్నారు. అలాగే మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ను ఆహ్వానించినట్లు ఇండియా టుడే తెలిపింది. అయితే, తమ్ముడి ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. వీరితోపాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.