నందమూరి కుటుంబ 4వ తరం వారసుడని పరిచయం చేస్తూ….

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ కి వరల్డ్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ద్వారా ప్రతిభావంతులైన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా గ్రాండ్ ముహూర్తం షూట్ ఈ రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో వైభవంగా జరిగింది. ప్రారంభోత్సవ వేడుకకు శ్రీమతి గారపాటి లోకేశ్వరి, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, శ్రీమతి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టారు. దగ్గుబాటి పురందేశ్వరి కెమరా స్విచాన్ చేశారు. లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి సుహాసిని, నందమూరి మోహన్ రూప, శ్రీమంతిని, నందమూరి వసుందర బాలకృష్ణ, దగ్గుబాటి నివేదిత, నందమూరి దీపిక, చలసాని చాము, నందమూరి జయశ్రీ, నందమూరి లక్ష్మీ హరి కృష్ణ, కంటమెన్ని దీక్షిత స్క్రిప్ట్ ని అందించారు. నందమూరి మోహన్ కృష్ణ డీవోపీ చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ముహూర్తం షూట్ లో ఈవెంట్ లో గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాన్నగారు ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహా మనిషి. ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన కుమారులు, మనవళ్లు ఎంతో కృషి చేస్తున్నారు. వారంతా కూడా స్టార్‌లుగా దూసుకెల్తున్నారు. ఇప్పుడు ఆయన మునిమనవడు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మీ అందరి ప్రోత్సాహం అతడికి చాలా అవసరం. అందరూ తారక రామారావును ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అతన్ని పరిచయం చేస్తున్న వైవీఎస్‌ చౌదరీ గారికి, గీతగారికి థాంక్యూ’అన్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబం నుంచి మరో తరం  తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కళాకారుడు ఎంతో తపస్సు చేయాలి. కళామతల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నతశిఖరాలు అధిరోహిస్తాడు. మా నాన్న ఒక కళాతపస్వీ. ఆయన క్రమశిక్షణతో చలనచిత్ర రంగానికి  తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే ఆయన పేరును భారతీయ సినీ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించారు. తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ కూడా చలనచిత్ర రంగంపై చెదరని ముద్ర వేశారు. ఆ తర్వాత తరం నందమూరి కల్యాణ్‌రామ్‌, నందమూరి తారకరామారావు కూడా అంకితభావంతో తమ ఉనికికి చాటుకున్నారు. అలానే ఇప్పుడు మరో తరం పరిశ్రమలోకి వస్తోంది. మేమంతా రామ్‌ అని పిలుచుకునే ఎన్టీఆర్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి కూడా కళామతల్లి ఆశీర్వాదంతో పాటు కుటుంబసభ్యుల ఆశీస్సులూ ఉంటాయి. ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువుతీరి ఉంటాడో అలాగే వైవిఎస్ చౌదరి గారి హృదయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు గారు కొలువుతీరి ఉంటారు. నాన్నగారిపై ఆయనకు ఉన్నటువంటి ఆరాధన భావాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్ బ్యానర్లో రామ్ ని పరిచయంచేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా అద్భుతంగా రాణించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. రామ్ కి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటున్నాం’అన్నారు

నారా భువనేశ్వరి మాట్లాడుతూ… నందమూరి తారక రామారావు, అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారి లాగా కీర్తి ప్రతిష్ట ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులంతా అదే కోరుకుంటున్నారు. నాలుగు తరం ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. రామ్ తన టాలెంట్ నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కసి ఉన్న వ్యక్తి కచ్చితంగా ఏం కోరుకుంటాడో ఆ స్థాయికి ఎదగగలడు. న్యూ టాలెంట్ రోర్స్  ప్రొడక్షన్ నెంబర్ 1 నిర్మిస్తున్న గీత గారికి నా కృతజ్ఞతలు.  డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. చౌదరి గారు వారి కుటుంబం నందమూరి కుటుంబానికి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. అందుకు కూడా మా కృతజ్ఞతలు. రామ్ తప్పకుండా విజయంతో ముందుకెళ్తాడు. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’అన్నారు

నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం నేను అస్త్ర సన్యాసం చేసి పాతికేళ్లయింది. నా లాస్ట్ చిత్రం గొప్పింటి అల్లుడు. పాతికెళ్ళు తర్వాత నా మనిమనవడి షాట్ తీసే భాగ్యం నాకు కలిగింది. నాన్నగారికి ఇష్టమైన మనవడు మా జానకిరామ్. మా నాన్నగారికి జానకిరామ్ కి చాలా చనువు ఉండేది. జానకిరామ్ పెద్ద కుమారుడికి నాన్నగారు ఆప్యాయతతో నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు. రామ్ కి సినిమా అంటే చాలా ఇష్టం. ఈ రంగంలోకి రావడానికి చాలా కృషి చేశాడు. చౌదరి గారికి రామ్ ప్రతిభ నచ్చింది. ఆయన సినిమా తీయడానికి ముందడుగు వేశారు. ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి గారికి, గీత గారికి అభినందనలు. రామ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ మొదలైయింది, ఈ సినిమాలో కథానాయకుడు మా మనవడు.  దర్శకుడు అద్భుతమైనటువంటి కథని సిద్ధం చేశారు.  సీతారామరాజు లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య ఇలా మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్న వైవిఎస్ చౌదరి గారు..  అయిన చేయబోతున్న ఈ కొత్త చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించి మా మనవడికి పేరు పేరు ప్రతిష్టలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్’అన్నారు

నిర్మాత యలమంచిలి గీత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోకేశ్వరి గారు, భువనేశ్వరి గారు పురందేశ్వరి గారికి నందమూరి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. వారు వచ్చి మా ప్రొటెక్షన్ నెంబర్ వన్ ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని, ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేస్తామని నమ్ముతున్నాం’అన్నారు  

హీరోయిన్ వీణ రావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. లోకేశ్వరి గారు భువనేశ్వరి గారు పురందేశ్వరి గారు ఈ వేడుకకు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి.  ప్రేక్షకులు మా సినిమాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను

హీరో నందమూరి తారక రామారావు మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.  మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, పక్కనే నిల్చుని చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు మా నాన్న నందమూరి జానకి రామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను ఈరోజు నా కుటుంబసభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పటినుంచి మీడియా ఎంతో సహకరించింది. వారందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’’అన్నారు.

డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్టీఆర్‌ గారి ఘాట్‌ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఎన్టీఆర్ గారి  అభిమానులకు ఇది ఒక శక్తిని ఇచ్చే స్థలం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆయన ఉంటారు. ఆయన కుటుంబంలో నాలుగోతరానికి చెందిన వ్యక్తి.. ఆయన పేరు పెట్టుకున్న మనవడు ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభోత్సవం ఈ ప్రదేశంలో జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన పేరు పెట్టుకోవడం అంటే ఈజీ కాదు.. పేరు ఎవరైనా పెట్టుకుంటారు.. కానీ ఆ రంగంలో రాణించగలగాలి. ఈ కార్యక్రమం మా ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ గారి కుమార్తెల చేతులమీదగా జరగడం అద్భుతమైన అనుభూతి. ఇది ఒక మిసైల్ లాంచింగ్ లా అనిపించింది. ఇది మరపురాని ఘట్టం. తారకరామారావు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తారకరామారావుకు కుటుంబసభ్యులందరి సపోర్ట్‌ ఉంది. ముహూర్త షార్ట్ కి మోహన్ కృష్ణ గారు డిఓపిగా చేయడం మా అదృష్టం. రామకృష్ణ గారు నందమూరి అభిమానులకు ఒక ఆక్సిజన్ లాంటి వ్యక్తి. ఈ కార్యక్రమానికి నీకు నేను హరికృష్ణ లాగా ఉంటాను అని ఆయన చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తారకరామారావుకు అందరి అండదండలు ఉంటాయి. తను మంచి స్థాయికి ఎదగాలని ఒక నందమూరి వీర అభిమానిగా కోరుకుంటున్నాను. తెలుగు సాహిత్యం తెలుగు సంప్రదాయం హైందవ సంస్కృతి నేపధ్యంలో నా సాయశక్తుల కష్టపడి ఒక మంచి కథని తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మేము కష్టపడి పనిచేస్తాం. మా కష్టాన్ని చూడండి. ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను. నందమూరి కుటుంబ సభ్యులు, పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కి చెందిన ప్రముఖులు, మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాం. థాంక్యూ’అన్నారు  

ఈ చిత్రానికి ఆస్కార్-విజేత MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరొక ఆస్కార్-విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు సినిమా అభిమానులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

తారాగణం: నందమూరి తారక రామారావు, వీణా రావు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: వైవిఎస్ చౌదరి
బ్యానర్: న్యూ టాలెంట్ రోర్స్ @
నిర్మాత: యలమంచిలి గీత
సంగీతం: ఎంఎం కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి
పీఆర్వో: వంశీ-శేఖర్