రిలేటబుల్ కథలతో ఆకట్టుకోనున్న “యాంగర్ టేల్స్” ట్రైలర్ విడుదల!!

రోజువారీ జీవితంలో అసహనం, చిరాకు, విసుగు తెప్పించే ఎన్నో పరిస్థితుల మధ్య కోపాన్ని అనుచుకోవడం, దాచుకోవడం కత్తి మీద సామే.

అలాంటి విపరీతమైన పరిస్థితుల్లో కొన్ని సంఘటనల మధ్య ఇరుక్కున్న పాత్రల కోపాలు, ప్రతిచర్యలు స్వభావానుసారంగా ఎలా బయటపడ్డాయి వాటి వల్ల ఏం జరిగింది వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో వాస్తవానికి దగ్గరగా చూపించారు “యాంగర్ టేల్స్” ట్రైలర్.

తిలక్ ప్రభాల దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వాస్తవాలకు దగ్గరగా ఉండే పాత్రల కోపం చుట్టూ తిరిగే కథ, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, వెంకటేష్ మహా, సుహాస్, బిందు మాధవి, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ వంటి భారీ తారాగణం తో అనూహ్యమైన అంచనాల మధ్య ‘యాంగర్ టేల్స్’ డిస్ని+హాట్ స్టార్ లో మార్చి 9 న విడుదలవనుంది.

నటి నటులు:
వెంకటేష్ మహా
సుహాస్
రవీంద్ర విజయ్
బిందు మాధవి
ఫణి ఆచార్య
తరుణ్ భాస్కర్
మడోన్నా సెబాస్టియన్

సాంకేతిక నిపుణులు:
డిఓపి – అమరదీప్, వినోద్ కే బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజె ఆరోన్
కూర్పు – కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం – స్మరన్ సాయి
రచయితలు – కార్తికేయ కారెడ్ల, ప్రభల తిలక్
ప్రొడక్షన్ డిజైనర్ – అశోక్ నర్రా
కాస్ట్యూమ్ డిజైన్, స్టైలింగ్ – సంజన శ్రీనివాస్
సౌండ్ డిజైనర్స్ – సాయి మనీందర్ రెడ్డి, నాగార్జున తాళ్లపల్లి
కో-ప్రొడ్యూసర్ – కృష్ణం గదాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కార్తికేయ కారెడ్ల
టైటిల్ ఆనిమేషన్ – శక్తి గ్రాఫిస్ట్
పబ్లిసిటీ డిజైన్స్ – తారక్ సాయి ప్రతీక్
నిర్మాతలు – శ్రీధర్ రెడ్డి, సుహాస్
దర్శకుడు – ప్రభల తిలక్