విశాల్ తమన్నాల యాక్షన్ షూర్ షాట్ హిట్… కారణం ఇదే

హీరో విశాల్, తెలుగు అబ్బాయి అయినప్పటికీ, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి ఎదిగిన ఒక సూపర్ యాక్సన్ హీరో. వరుస హిట్లతో కెరియర్ లో దూసుకొనిపోతున్న మన విశాల్ రీసెంట్ గా చేస్తున్న సినిమా యాక్సన్. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తుండగా శ్రీను ఆడెపు ( వరంగల్ శ్రీను ) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ నవంబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్ ఇప్పటికే ఈ సినిమాపై క్రెజ్ అమాంతం పెంచేసాయి. అయితే ఇప్పుడు తెలుగు నాట ఈసారి విశాల్ రికార్డులు సృష్టించే రేంజ్ లో హిట్టు కొట్టడం గ్యారెంటీ అనే టాక్ ఎక్కువుగా వినిపిస్తుంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

ఈ సినిమాకు పనిచేస్తున్న టీమ్ అందరూ గతంలో హిట్టు రికార్డ్ లలో ఉన్నవారు కావడం ఒకటి, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న తమ్మన్నా నటనా, అందచందాలు. ఈపాటికే ఈ సినిమాలో తమన్నా వేసిన బికినీ పిక్చర్స్ కుర్రకారుని ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అనిపించే విధంగా చేసాయి. హీరో విశాల్ కి తెలుగునాట మంచి క్రెజ్ ఎలానో ఉంది, తనకి ఇక్కడ ఒక మాస్ హీరోగా మంచి గుర్తింపు కూడా వుంది. హిప్ హప్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా నిర్మాత వరంగల్ శ్రీను ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్, వాల్మీకి, రాజు గారి గది వంటి వరుస హిట్లతో మంచి క్రెజీ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. విశాల్ కెరియర్ లోనే హై బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విజువల్ వండర్ గా నిలువనుంది. ఏది ఏమైనా ఈ 15న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రమ్మరథం పట్టేలా ఉన్నారు అని చెప్పుకోవచ్చు.