మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో సినిమా చేయడానికి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిపోయింది. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్ గా రానున్న విషయం తెలిసిందే. ఇక ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ షూట్ మార్చిలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో సెట్ చేయబడినట్లు తెలుస్తోంది. కొన్ని కీలకమైన ఎపిసోడ్లు ఆ నగరంలోనే షూట్ చేస్తారట.
గతంలో మెగాస్టార్ చూడాలని వుంది సినిమా కోల్‌కతా నేపథ్యంలో వచ్చినదే. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ త్వరలో కోల్‌కతా షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. వేదలం రీమేక్‌లో చిరంజీవి సోదరి పాత్ర కోసం సాయి పల్లవిని ఫిక్స్ చేయడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాకు మహతి స్వరా సాగర్ సంగీతం అందించే అవకాశం ఉందట. ఇక అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై సినిమాను నిర్మించనున్నారు. ఆచార్య షూట్ పూర్తయిన తర్వాత మెగాస్టార్ ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని సమాచారం.