Tollywood: కార్తికేయ‌2 షూటింగ్‌లో ప్ర‌మాదం.. హీరో నిఖిల్‌కు గాయాలు!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రం కార్తికేయకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈTollywood చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవ‌లే గుజ‌రాత్‌కు వెళ్లారు చిత్ర‌బృందం. అయితే Tollywood చిత్ర షూటింగ్‌లో భాగంగా యాక్ష‌న్ సీన్స్ తీస్తుండ‌గా.. హీరో నిఖిల్‌కు యాక్సిడెంట్ అయింద‌ని స‌మాచారం. దీంతో నిఖిల్‌కు స్వ‌ల్ప గాయాలు అవ‌డంతో వెంట‌నే షూటింగ్ ఆపేశార‌ని..

kaarthikeya-2

మ‌రికొన్ని రోజుల పాటు ఈ స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ నిలిపివేశార‌ని చిత్ర‌బృందం నుంచి స‌మాచారం. నిఖిల్ ఆరోగ్య విష‌యంలో అభిమానులెవ్వ‌రు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని, ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయ‌ని.. ప్ర‌స్తుతం నిఖిల్‌ కొంత విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లు చిత్ర‌బృందం నుంచి స‌మాచారం. ఇక ఈ Tollywood సినిమాలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నారు.