‘హౌజ్ ఫుల్’ దర్శకుడు లైంగికంగా వేధించాడు: ఇండియన్ మోడల్!!

హౌజ్ ఫుల్ పార్ట్1, 2లతో స్టార్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సాజిద్ ఖాన్ పై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నాడు. 2018లో మీటూ ఉద్యమంలో ఈ సీనియర్ దర్శకుడిపై ముగ్గురు హీరోయిన్స్ తో పాటు ఒక లేడి జర్నలిస్ట్ కూడా ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి సాజిద్ ఎక్కువగా కనిపించడం లేదు.

ఇక చాలా రోజుల తరువాత ఇండియన్ మోడల్ పౌలా అతను తనను కూడా లైంగికంగా వేదించడానికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘గతంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అంటే.. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు మాత్రమే. అలాగే నా కుటుంబం మీద ఆధారపడాల్సి వచ్చేది. వారిని ఇబ్బంది పెట్టకూడదనే భావనతో ధైర్యం చేయలేదు. ఇప్పుడు నేను వాళ్ళతో ఉండడం లేదు. నా సొంత సంపాదనతో బ్రతుకుతున్నాను. ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నపుడే చెప్పాలని అనిపించింది. అందుకే ఇప్పుడు చెబుతున్నాను’ అని పౌలా వివరణ ఇవ్వడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.