ఇండియన్ సినిమాలు ఆస్కార్‌కి వెళ్లడం చాలా అరుదు. కానీ తాజాగా ఒక ఇండియన్ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయింది. జల్లికట్టు క్రీడపై మలయాళంలో తెరకెక్కిన సినిమాకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో ఇండియా నుంచి జల్లికట్టు సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు ఛైర్మన్ రాహుల్ రావైల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఆస్కార్ నామినేషన్ కోసం ఇండియా నుంచి 27 సినిమాలు వచ్చాయని, అందులో జల్లికట్టు సినిమా ఒక్కటి మాత్రమే నామినేట్ అయిందని చెప్పారు. మలయాళీ డైరెక్టర్ లిజో జెస్ పెల్లిస్సేరి ఈ జల్లికట్టు సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను స్పూర్తిగా తీసుకుని తమిళంలో సూర్య హీరోగా జల్లికట్టు కథాంశంతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.
వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వడివాసల్ అనే టైటిల్ పెట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళనాడులో జల్లికట్టు క్రీడ ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలిసిందే. తమిళ ప్రజలు ఈ క్రీడను తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కేంద్రం నిషేధం విధిస్తే పోరాటం చేసి మళ్లీ సాధించుకున్నారు.