‘ఆపరేషన్ సిందూర్’ విజయంతో శత్రువుకు భారత సైన్యం సమాధానం: టాలీవుడ్ స్టార్స్ సలాం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై నిన్న అర్ధరాత్రి మెరుపుదాడులు జరిపింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, భారత సైన్యానికి సలామ్ చేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్, సీనియర్ నటి ఖుష్బూ, హీరోయిన్స్ తాప్సీ, కాజల్ అగర్వాల్, డైరెక్టర్స్ బాబీ, మెహర్ రమేష్‌తో సహా ఎందరో సోషల్ మీడియా ద్వారా ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతు తెలిపారు. అలాగే, బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు కూడా భారత సైన్యం ధైర్యసాహసాలను కొనియాడుతూ స్పందిస్తున్నారు.