సేనాపతి ఈజ్ బ్యాక్… పోస్టర్ అదిరింది

ఇప్పటికే రెండు షెడ్యూల్‌లను పూర్తి చేసుకున్న ఇండియన్ సినిమా షూటింగ్ కి చిత్ర యూనిట్ గ్యాప్ ఇచ్చారు. కమల్ బర్త్ డే సందర్భంగా షెడ్యూల్ గ్యాప్ తీసుకున్న శంకర్ అండ్ కమల్, నవంబర్ 13న మళ్లీ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. భోపాల్ లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసారట.

అందులో ఒక్క ఫైట్ కోసం రూ.40కోట్లను ఖర్చు పెట్టడానికి శంకర్ రెడి అయ్యాడు. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు, 500మంది ఫైటర్స్ తో పీటర్ హెయిన్ కంపోజ్ చేయనున్న ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉండబోతోందని సమాచారం. తాజాగా కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రెండు దశాబ్దాల క్రితం భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ని సేనపతిగా ఎలా చూశామో, ఇప్పుడు అదే రేంజులో మళ్లీ చూడబోతున్నారు అనే ఫీలింగ్ కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.