చైనాకి చుక్కలు చూపిస్తున్న ఇండియా అమెరికా

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసే స్థాయికి రావడం కారణం చైనానే అని బలంగా చెప్పిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, మరో అడుగు ముందుకేసి చైనాకి హ్యుజ్ చెక్ పెట్టాడు. చైనా సంబంధించిన యాప్స్ అయిన టిక్ టాక్, వీ చాట్ లాంటి బ్యాన్ చేస్తూ ట్రంప్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ ద్వారా చైనా, అమెరికన్ల పర్సనల్ డేటాని సేకరిస్తుందని.. సిటిజన్స్ ప్రైవసీ, అమెరికా భద్రతని దృష్టిలో పెట్టుకోని ఈ యాప్స్ ని బ్యాన్ చేస్తున్నట్లు కామర్స్ సెక్రటరీ విల్బర్ రోస్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

అమెరికా కన్నా ముందు ఇండియా ఈ నిర్ణయాన్ని తీసుకోని చైనాకి సంబంధించిన ప్రతి యాప్ ని బ్యాన్ చేసింది. మన సరిహద్దుల్లోకి రావడం, సైనికుల్ని చంపడం, డేటా సేకరించడం లాంటి కారణాలు చూపిస్తూ మోదీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చైనాకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ ట్రంప్ కూడా చేయడం డ్రాగన్ దేశానికి కోలుకోలేని దెబ్బె. దేశం భద్రతా విషయానికి వస్తే ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటామని ఈ ఇద్దరూ స్పష్టం చేశారు.