సిక్స్ మినిట్ షాట్ సింగిల్ టేక్ లో..తుది దశ చిత్రీకరణలో వెంకట్ ప్రభు “మానాడు”!!

తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి” 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం “మానాడు” చిత్రీకరణ చివరి దశలో ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.


ఈ చిత్రంలో ఆరు నిమిషాల నిడివి గల ఓ షాట్ ను సింగిల్ షాట్ లో చేసి శభాష్ అనిపించుకున్నారు శింబు. ఈ షాట్ లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్సన్ తోపాటు.. ఎస్.జె.సూర్య పాల్గొన్నారు. నటుడిగా శింబు సత్తా అందరికీ తెలిసిందే!


సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా స్వర సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎమ్.నాథన్, పోరాటాలు: స్టంట్ శివ, నృత్యాలు: రాజు సుందరం, బ్యానర్: వి హౌస్, నిర్మాత: సురేష్ కామాక్షి, రచన-దర్శకత్వం: వెంకట్ ప్రభు!!