ఎవ‌డే సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న`రాధాకృష్ణ`‌!!

ప్ర‌ముఖ ద‌ర్శకుడు ఢ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ చిత్రాన్నిమంతెన న‌ర‌సింహ‌రాజు (చిలుకూరు) స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌‌టికే విడుద‌లైన పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ చిత్రం నుండి ఎవ‌డే సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌.

అందాల‌రాముడులాంటి బంగారు బుల్లోడే.. మందారం బుగ్గే మీటి ముద్దాడే సిన్నోడే. ఎవ‌డే నా కోసం వ‌రుడైపుట్టిన వాడు ఎవ‌డే.. నా కోసం ఆశ‌గా వేచిన వాడు ఎవ‌డే..నా క‌థ‌కే నాయ‌కుడ‌య్యే పిల్లాడు..బూచాడు ఎవ‌డే..ఈ బోమ్మ‌కు రంగులు అద్దేవాడు ఎవ‌డే.. అంటూ ఆహ్లాదంగా సాగే ఈ పాటకు చైత‌న్య ప్ర‌సాద్ సాహిత్యం అందించ‌గా లిప్సిక భాష్యం, మోహ‌న‌బోగ‌రాజు అంతే అందంగా ఆల‌పించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కురాలు ఎం.ఎం.శ్రీ‌లేఖ అద్బుత‌మైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. ఈ పాట‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ – మా `రాధాకృష్ణ` చిత్రం నుండి ఎం.ఎం. శ్రీలేఖ గారి సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన అన్ని సాంగ్స్ సూప‌ర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన `ఎవ‌డే` సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 5న ఈ చిత్రాన్నివ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), ల‌క్ష్మీ పార్వ‌తి, అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ‌, ఎడిటింగ్‌: డి. వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్: వి. ఎన్ సాయిమ‌ణి, కో- ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నివాస్ కానూరు, స‌మ‌ర్ప‌ణ‌: మంతెన న‌ర‌సింహ‌రాజు (చిలుకూరు), నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌: పుప్పాల సాగ‌రిక‌ కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.