
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
సింగిల్ సినిమాలో మీ క్యారెక్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హీరో మీరే అనే రివ్యూస్ కూడా వచ్చాయి. ఎలా అనిపిస్తుంది ?
-మనం చికెన్ బిర్యాని తిన్నప్పుడు అప్పుడప్పుడు లివర్ పీస్ వస్తుంది. అది బిర్యాని కి ఒక టేస్ట్ ని తీసుకొచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలాంటిదే(నవ్వుతూ)
మీరు తప్పితే మరో ఆప్షన్ లేదని డైరెక్టర్ గారు చెప్పారు?
-డైరెక్టర్ రాజ్ గారు చాలా మంచి పర్సన్. శ్రీ విష్ణు గారు చాలా స్పాంటీనియస్ గా డైలాగ్స్ ని ఇంప్రవిజ్ చేసేస్తారు. దానికి పక్కన అంతే స్పాంటేనియస్ గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. అలాంటి స్పాంటేనియస్ క్యారెక్టర్ కి నేనైతే కరెక్ట్ అని డైరెక్టర్ గారు భావించారు. అందుకే శ్రీ విష్ణు గారు ఉండే ఫ్రేంలో వెన్నెల కిషోర్ ఉండాలని ఆయన ముందే ఫిక్స్ అయ్యారు.
-ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా హిలేరియస్ గా అనిపించింది. భాను నందు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అదే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీదకు వచ్చింది.
– సినిమాని థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నా సినిమా నేను స్క్రీన్ మీద చూసుకోలేను. కానీ ఈ సినిమా థియేటర్లో
ఆడియన్స్ తో కలిసి చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ నాకు చాలా ఆనందం ఇచ్చింది.
కామెడీ పాత్రల్లో కొత్తదనాన్ని ఎంచుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
-నిజానికి కామెడీ పాత్రలని ఎంచుకునే అంత వెర్సటాలిటీ ఇప్పుడు లేదు. ముందు రైటర్స్ ని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. రైటర్స్ కొత్త కొత్త ఆలోచనలతో వస్తేనే కామెడీ పాత్రలు కూడా కొత్త వస్తాయి. చాలాసార్లు మనకి రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. కానీ దాన్ని మనం ఓన్ చేసుకొని అందులోనే ఏదో ఒక యూనిక్నెస్ ని ప్రజెంట్ చేసేలా ప్రయత్నం చేస్తుంటాను. నావల్ల ఒక సీన్ ముందుకెళ్లడం నాకు గొప్ప ఆనందం ఇస్తుంది.
బేసిగ్గా ఎలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు?
-మన ప్రపంచం కానీ ఒక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి అక్కడ అలరించే పాత్రలు చేయడం నాకు ఇష్టం. ఉదాహరణకు గీతగోవిందం అమీతుమీ చిత్రాల్లో చేసిన పాత్రలు నాకు బాగా ఇష్టం.


ఇప్పుడున్న కాలంలో కామెడీ పండించడం ఎంత ఛాలెంజ్?
-వెరీ చాలెంజ్ ఇప్పుడు కంటెంట్ విపరీతంగా అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ ఉంది. రీల్స్ ఓపెన్ చేస్తేనే బోలెడు కామెడీ వీడియోలు కనిపిస్తాయి. థియేటర్స్ కి వచ్చి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే అంతకుమించి ఇవ్వగలగాలి. అలాంటి క్యారెక్టర్ కుదరాలి. అవన్నీ కుదరడం వెరీ బిగ్ చాలెంజ్.
మీకు ఏ జోనర్ ఇష్టం ?
-నాకు థ్రిల్లర్స్ ఇష్టం.
చార్లీ సినిమా తర్వాత మళ్లీ హీరోగా సినిమా చేయలేదు. మళ్ళీ హీరోగా చేయాలని ఆలోచన ఉందా?
-కథలు వస్తున్నాయి గాని మళ్లీ లవ్ స్టోరీ, పాటలు అంటున్నారు. అవి అంతగా సూట్ కావు. ప్రోపర్ కామెడీ కథ కుదిరితే తప్పకుండా చేస్తాను.
బ్రహ్మానందం గారు మీరు తన వారసుడని చెప్పడం ఎలా అనిపించింది?
-అది ఆయన ప్రేమతో అన్నమాట. ఏదో నాకు కొంత బూస్టప్ ఇవ్వడానికి ఆ మాట అభిమానంతో చెప్పినదే.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
-నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు. దూకుడు సినిమా తర్వాతే నా డ్రీమ్ రోల్ అయిపోయింది. మహేష్ బాబు గారి పక్కన అంతా మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా డ్రీమ్ రోల్. ఇప్పుడు చేస్తుందంతా బోనస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను.
మీ ఫేవరెట్ క్యారెక్టర్స్?
చాలా ఉన్నాయి. అయితే జీవితాంతం గుర్తుండిపోయేవి వెన్నెల, బిందాస్, దూకుడు.
గీతా ఆర్ట్స్ లో అరవింద్ అనే క్యారెక్టర్ చేయమన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?
-ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా లక్కీగా ఫీల్ అయ్యాను.