అసురన్, కర్ణన్ సెంటిమెంట్ మారన్ కి కలిసోస్తుందా?

కోలీవుడ్ మోస్ట్ కన్సిస్టెంట్ స్టార్ హీరో, రెండు సార్లు నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ పుట్టిన రోజు సంధర్భంగా, అతని నెక్స్ట్ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ధనుష్ ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. D43 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ తో టైటిల్ ని కూడా రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మారన్ అనే టైటిల్ ఖరారు చేసి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ధనుష్ స్టైలిష్ లుక్ లో, యాంగ్రీ మ్యాన్ గా కనిపించాడు.

సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అయ్యి, ట్విట్టర్ లో టాప్ ట్రేండింగ్ లో ఉంది. ద్రువంగల్ పదినారు, మాఫియా చాప్టర్ 1 లాంటి న్యూ ఏజ్ థ్రిల్లర్స్ ఇచ్చిన కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో ధనుష్ యాక్ట్ చేస్తుండడం ఈ హైప్ కి ఒక కారణం అయితే, ధనుష్ జీవీ ప్రకాష్ మ్యూజికల్ కాంబినేషన్ అయిదో సారి రిపీట్ అవుతూ ఉండడం మరో కారణం. ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. గతంలో జీవీ ప్రకాష్ ధనుష్ కాంబినేషన్ లో పొల్లాదవన్, ఆడుకలం, మైకం ఎన్న,అసురన్ లాంటి చార్ట్ బస్టర్స్ వచ్చాయి. పైగా అసురన్, కర్ణన్ స్టైల్ లోనే ఈ మూవీ టైటిల్ కూడా న్ తో ఎండ్ అయ్యేలా మారన్ అని పెట్టారు. సో అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్న ఈ ప్రాజెక్ట్ ధనుష్ కి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ధనుష్ పుట్టిన రోజు సంధర్భంగా చిత్ర యూనిట్ విషెస్ చెప్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ధనుష్ పేరు ముందు ఇలయ సూపర్ స్టార్ అని ట్యాగ్ వేయడం విశేషం. కొత్త సూపర్ స్టార్ ధనుష్ అని తెలుగు అర్ధం. రజినీకాంత్ తర్వాత తమిళనాట ఆ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ధనుష్ కి మాత్రమే దక్కడం విశేషం.