ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు… దర్శకురాలు వి.వి. రుషిక

ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు… దర్శకురాలు వి.వి. రుషిక

సెప్టెంబర్ 23వ తేదీ రిలీజ్ అయిన సినిమాలలో ప్రేక్షకాదరణ పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందించిన ” ఇక్షు “. రామ్ అగ్నివేత్ హీరోగా, రాజీవ్ కనకాల, చిత్రం శ్రీను, కాలకేయ ప్రభాకర్, చమ్మక్ చంద్ర, అదిరే అభి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా సక్సెస్ మీట్ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.. హీరో రామ్ అగినేత్ మాట్లాడుతూ సినిమా రిలీజ్ రోజు ఏం అవుతుందోనని చాలా భయపడ్డాను, మీ అందరి దయవల్ల సక్సెస్ అయింది. మీకు, నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు పాదాభివందనాలు అన్నారు.. దర్శకురాలు వి.వి.రుషిక మాట్లాడుతూ దర్శకురాలిగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. చాలామంది ఫోన్ చేసి చాలా బాగా తీశావని ప్రశంసిస్తున్నారు.. నాలో విశ్వాసం పెరిగింది.. నాకీ అవకాశం కల్పించిన నిర్మాత హనుమంతరావు నాయుడు గారికి ఋణపడి ఉంటానని తెలిపారు.. నిర్మాత మాట్లాడుతూ ఈ రెస్పాన్స్ నాలో ధైర్యం నింపింది.. ఈ ధైర్యం తోనే త్వరలో ఇదే డైరెక్టర్ తో రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నానని
సినిమా చూసి ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు వందనాలు అన్నారు..