‘ఇది కల కాదు’ చిత్రం ‘ఊర్వశి’ ఓటిటి లోవిడుదల!!

అదీబ్ నజీర్ స్వీయ నిర్మాణంలో… ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం “ఇది కల కాదు“. సీనియర్ నటులు బెనర్జీ, షఫీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందింది. శ్రీజ, మనీష, దానిక, మాధవి, సుప్రియ, పూజిత జొన్నలగడ్డ ఇతర పాత్రలు పోషించారు.ఈ చిత్రం ఈనెల 14 నుంచి ఊర్వశి ప్రేక్షకులను అలరించనుంది.

ఈ సందర్భంగా అదీబ్ నజీర్ మాట్లాడుతూ… “కరోన కారణంగా థియేటర్స్ లో కాకుండా… ఊర్వశి ఓటిటి లో మా ‘ఇది కల కాదు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. వైవిధ్యమైన వినోదం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం అమితంగా అలరిస్తుంది” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: వెంకటేష్ బొల్లా, ఛాయాగ్రహణం: వి.సత్యానంద్, కూర్పు: నగేష్,
నిర్మాణం-దర్శకత్వం: అదీబ్ నజీర్!!