మారేడుమల్లి ఫారెస్ట్ టు గోవా వయా రంపచోడవరం…

తగ్గేదే లే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టీజర్ లో చెప్పిన ఈ చిన్న డైలాగ్ ఫుల్ వైరల్ అయ్యింది. ఎవరిని కదిపినా సంధర్భం వస్తే చాలు తగ్గేదే లే అంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియాపై ఇండియన్ వైడ్ హ్యుజ్ హైప్ ఉంది. రెండు భాగాలుగా రూపొందుతున్న పుష్పలో నేషనల్ క్రుష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫజిల్ విలన్ గా కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని ఇప్పటివరకూ మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపారు. భారి యాక్షన్ ఎపిసోడ్స్ ని ఈ ప్రాంతంలో షూట్ చేసిన సుకుమార్, తదుపరి షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. గోవాలో అల్లు అర్జున్ కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను, ఆయన ఇంట్రడక్షన్స్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. దేవి ఇచ్చిన ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందట.

ఏప్రిల్ 7న రిలీజ్ అయిన పుష్ప టీజర్ ఇప్పటివరకూ 74 మిలియన్ వ్యూస్ అండ్ 1.7 మిలియన్ లైక్స్ సాదించి టాలీవుడ్ యుట్యూబ్ హిస్టరీలోనే కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది పుష్ప పార్ట్ 1 రిలీజ్ అవుతుండగా పార్ట్ 2 ఏడాది గ్యాప్ తర్వాత రానుంది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు.