మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్టి టీమ్‌వర్క్స్ లో మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీని పెంచింది. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ విడుదలౌతున్న నేపథ్యంలో హీరోయిన్ గోల్డీ నిస్సీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీ గురించి చెప్పండి ? ‘ఛాంగురే బంగారురాజా’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను తెలుగమ్మాయిని. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. కొన్ని షార్ట్స్ ఫిలిమ్స్ చేశాను. సినిమాలకి ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. రవితేజ గారి ప్రొడక్షన్ లో సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్స్ నచ్చి సెలెక్ట్ చేశారు. ‘ఛాంగురే బంగారురాజా’ నా ఫస్ట్ బిగ్ సినిమా.
సినిమాలు అంటే మీ కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం వుంది ?
మా అమ్మగారు చాలా ప్రోత్సహిస్తారు. నా ఇష్టాన్ని అర్ధం చేసుకొని ఆమెనే స్వయంగా నన్ను చాలా ఆడిషన్స్ కి తీసుకెళ్ళారు. ఈ విషయంలో మా అమ్మకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
‘ఛాంగురే బంగారురాజా’లో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో నా పాత్ర పేరు మంగరత్నం. తను కానిస్టేబుల్. కొంచెం గ్రే షేడ్ వుంటుంది. మంగరత్నం ను బంగార్రాజు ఇష్టపడతాడు. లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా వుంటుంది.
ఈ కథలో మీ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత వుంటుంది ?
ఇందులో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత వుంటుంది. నా పాత్ర మొదటి నుంచి చివరి వరకూ ట్రావెల్ అవుతుంది. నలుగురి కోణంలో చూపించే కథ ఇది. ఇందులో అన్నీ పాత్రలు కథలో కీలకంగా వుంటాయి.
ఇందులో కార్తిక్, మీకు ఎలాంటి సీన్స్ వుంటాయి ?
నేను కానిస్టేబుల్, కార్తిక్ మెకానిక్. ఆ ఏరియాలో వుండే ఏకైక మెకానిక్ తనే. లవ్ ట్రాక్ కూడా చాలా సరదాగా, ముద్దుగా వుంటుంది. హాయిగా ఫ్యామిలీ కలిసి చూసే సినిమా ఇది.
రవిబాబు, సత్య గారితో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ?
చాలా బావుంది. సత్య గారు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా హ్యుమరస్ గా వుంటారు. రవిగారు చాలా నాలెడ్జ్ పర్శన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
మొదటి సినిమా రవితేజ గారినిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది ? ఇకపై హీరోయిన్ గానే కొనసాగుతారా ?
రవితేజ గారి నిర్మాణంలో నా మొదటి సినిమా చేయడం చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను. ఇది నెక్స్ట్ లెవల్ ఫీలింగ్. ఇందులో నా పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇందులో నా పాత్రకు పెర్ఫార్మ్ చేసే స్కోప్ వుంది. భవిష్యత్ లో మంచి కంటెంట్ వున్న కథలు వస్తే అన్ని రకాల పాత్రలు చేయాలని వుంది.
రవితేజ గారిని కలిశారా ?
మేము షూటింగ్ పూర్తయిన తర్వాతే రవితేజ గారిని కలిశాం. ఆయన్ని చూసినప్పుడు ఏం మాట్లాడలేకపోయాను. ఆయన మాత్రం .. ‘’సినిమా చూశాను. అందరూ చాలా బాగా చేశారు. నువ్వు కొత్త అయిన భయం లేకుండా నటించావ్’’ అని మెచ్చుకున్నారు. చాలా అనందంగా అనిపించింది.
మీకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది కదా.. సినిమాలకి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా అనిపించింది ?
నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నపుడు కూడా ఫ్రీ లాన్సింగానే చేశాను. ఐతే సినిమా పై ప్యాషన్ ఎక్కువ అనిపించింది. ప్రయత్నిస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు కూడా వస్తాయి. ఐతే రెండేళ్ళ నిరీక్షణకు సరైన ఫలితం వచ్చిందనే భావిస్తున్నాను.
డైరెక్టర్ సతీష్ వర్మ గారి గురించి ?
సతీష్ గారు చాలా క్లారిటీగా వుంటారు. ఆయన రాసిన స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా అలా డైలాగ్ చూసుకొని సీన్ ని అర్ధం చేసుకొని చేసేయొచ్చు. అంత నీట్ గా రాశారు. అలాగే కథ కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది.
రెండురోజుల్లో సినిమా విడుదలౌతుంది కదా ? ఎలా అనిపిస్తుంది
చాలా నెర్వస్ గా వుంది అదే సమయంలో ఎక్సయిట్మెంట్ కూడా వుంది. నన్ను నేను పెద్ద తెరపై చూసుకోవాలనే కల మరో రెండు రోజుల్లో నెరవేరుతోంది. అందరూ సినిమాని చూడాలి, మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
అరిస్ట్ గా ప్రయోగాత్మక పాత్రలు చేయాలని వుంటుంది. అన్ని రకాల పాత్రలతో అలరించాలని వుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్