మా శివ టాలెంట్‌మీద గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది, రూపేష్‌కుమార్‌ చౌదరితో చేసిన `22`మూవీతో పెద్ద హిట్ కొడ‌తాడు – డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్.

 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా జనవరి 7న హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ – ”శివ నాతో కలిసి చాలా సినిమాలకు వర్క్‌ చేశాడు. ఫస్ట్‌టైమ్‌ సినిమా చేస్తున్నాడు. శివ ఎవరో కాదు బి.ఎ.రాజుగారి అబ్బాయి. నాకు బాగా కావాల్సినవాడు. ఇప్పుడే ’22’ మూవీ చూశాను. చాలా బాగుంది. బేసిగ్గా శివ మీద నాకు నమ్మకం ఉంది. చాలా టాలెంటెడ్‌. పెద్ద డైరెక్టర్‌ కావాలి. పెద్ద హిట్‌ కొట్టాలి. అలాగే హీరో రూపేష్‌ కుమార్‌కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – ”22′ మొదటి షెడ్యూల్‌ అయ్యాక ఒకరోజు రాజుగారు, నేను, కల్సి ఉండగా రాజుగారి సెల్‌కి పూరిగారి నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. ‘మనోడు ఇరగదీసేస్తున్నాడంట. నాకు ఫీడ్‌ బ్యాక్ వ‌చ్చింది. వెరీ హ్యాపీ ఫర్‌ శివ`అని ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉండి కూడా శివ గురించి హ్యాపీగా ఫీలై మెసేజ్‌ చేశారు. శివ‌ 35 రోజుల్లో టాకీ పూర్తి చేశాడు. ఎంత ప్రీ ప్రొడక్షన్‌ చేసుకొని, ఎంతో ప్లానింగ్‌, కాన్ఫిడెన్స్‌ ఉంటేనే అంత తొందరగా షూటింగ్‌ పూర్తి చేయగలడు. టీమ్‌ అందరికీ మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”టెంపర్‌’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు పూరిగారు ‘మీ శివ తొందరగా డైరెక్టర్‌ అయిపోతాడు అని’ చెప్పారు. నేను ఎంకరేజ్‌ చేయడానికి అలా చెప్పారు అనుకున్నా. తర్వాత కలిసినప్పుడు కూడా చాలాసార్లు మీవాడు చాలా టాలెంటెడ్‌ అని చెప్పారు. ఒక ఫాదర్‌గా చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సడెన్‌గా ఒకరోజు రూపేష్‌కుమార్‌గారిని తీసుకొచ్చి సినిమా స్టార్ట్‌ చేస్తున్నాం. తనే హీరో, ప్రొడ్యూసర్‌. నెక్స్‌ట్‌ వీక్ సినిమా ఓపెనింగ్‌ అని చెప్పాడు. అలా నా ప్రమేయం లేకుండానే కథ రాసుకొని, ప్రొడ్యూసర్‌ని కన్విన్స్‌ చేసి, నాకు ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చాడు అంతే. సినిమా చూశాక కూడా అందరూ చాలా బాగుందని అంటున్నారు. నా పుట్టినరోజు నాడు ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అవడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్‌గా పూరిగారి శిష్యుడుగా అందరి ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాను. శివకి రూపేష్‌లాంటి హీరో, ప్రొడ్యూసర్‌ దొరకడం చాలా లక్కీ. సినిమా ఇంత తొందరగా పూర్తి అయ్యిందంటే దానికి కారణం రూపేష్‌కుమార్‌.  మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి కిరణ్‌ సినిమాటోగ్రాఫర్‌.ఇద్దరూ ఒకే సినిమాకి వర్క్‌ చేయడం నాకు డబుల్‌ హ్యాపీనెస్‌ ” అన్నారు.

హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి మాట్లాడుతూ – ”నా ఫస్ట్‌ ప్రొడక్షన్‌ టీజర్‌ పూరి జగన్నాథ్‌గారి చేతులమీదుగా లాంఛ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. శివగారు పూరిగారి దగ్గర వర్క్‌ చేశారు కాబట్టి ఏ లైన్‌ వినకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఈ క్రెడిట్‌ అంతా పూరి జగన్నాథ్‌గారికి, బి.ఎ.రాజుగారికే చెందుతుంది. ఆనీ మాస్టర్‌ నన్ను శివగారికి స‌రిచ‌యం చేశారు. ఆవిడను  లైఫ్‌లాంగ్‌ మర్చిపోలేను. సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగా చేశారు. రవిగారు మంచి విజువల్స్‌ ఇచ్చారు. షూటింగ్‌ అంతా చాలా స‌జావుగా జరిగింది. కొండా కృష్ణంరాజుగారు  ఇక్క‌డికి వ‌చ్చి మా సినిమాకి బ్లెస్సింగ్స్‌ అందించడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు శివకుమార్‌ మాట్లాడుతూ – ”పూరిగారితో నేను చాలా సినిమాలకు వర్క్‌ చేశాను. పూరిగారి దగ్గరకెళ్ళి మా సినిమా ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ మీ చేతులమీదుగా లాంచ్‌ చేయాలి అనగానే వెంటనే ‘శివ నువ్వు నా మనిషివి. నా దగ్గర చాలా సినిమాలకు వర్క్‌ చేశావు. నువ్వు అడగాలా’ అని వెంట‌నే యాక్సెప్ట్‌ చేశారు. ఆయన దగ్గర వర్క్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ  రుణపడి ఉంటాను. టీజర్‌ని చూసి మా యూనిట్‌ని అప్రిషియేట్‌ చేశారు. ముఖ్యంగా సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి బాగా ఇంప్రెస్‌ అయ్యారు. పూరి గారు మా టీజర్‌ రిలీజ్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే మేం అడగ్గానే సలోని మిశ్రా డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్‌ పూరి, ఛార్మిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సాయికార్తీక్‌గారికి కథ చెప్పగానే వెంటనే `మనం సినిమా చేస్తున్నాం`అన్నారు. డిఓపి రవికిరణ్‌ ముంబాయిలో వర్క్‌ చేశారు. సినిమా అంతా ఒక ముంబాయి సినిమాటోగ్రాఫర్‌ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే మంచి సెట్స్‌ వేసిన అడ్డాల రాజుగారికి థాంక్స్‌. ఎడిటర్‌ శ్యామ్‌ ప్రతి సీన్‌ కూడా క్రిస్పీలా ఉండేలా పర్‌ఫెక్ట్‌గా ఎడిట్‌ చేసి ఇచ్చారు. రూపేష్‌గారితో నా జర్నీ ఏడాదిన్నర క్రితం స్టార్ట్‌ అయ్యింది. నా మీద నమ్మకం ఉంచి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రూపేష్‌కుమార్‌గారికి ధన్యవాదాలు. నేను సినిమా కోసం ఏం అడిగినే ఇచ్చి ఎంకరేజ్‌ చేశారు. మా ఆయి ప్రొడక్షన్స్‌, టీమ్‌ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాలో నాతో పాటు వర్క్‌ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు“అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ రవికిరణ్‌ మాట్లాడుతూ – ”మొన్ననే సినిమా చూశాను. శ్యామ్‌ ఎడిటింగ్‌ బాగా చేశారు. చూశాక కాన్ఫిడెన్స్‌ పెరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివ, రూపేష్‌గార్లకి థాంక్స్‌.” అన్నారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ మాట్లాడుతూ – ”శివ ఈ సినిమాని చాలా క్లారిటీగా, స్పీడ్‌గా తీశాడు. ముందుగా చెప్పినట్టే ఎగ్జాక్ట్‌గా రెండు గంటల రెండు నిమిషాలు తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. పూరిగారి దగ్గర వర్క్‌ చేశాడు  కాబ‌ట్టే అదే స్పీడ్‌, అదే క్లారిటీతో సినిమా తీశాడు. ఆర్‌.ఆర్‌. బాగా వస్తోంది. ఈ సినిమాతో శివ పెద్ద డైరెక్టర్‌ కావాలి” అన్నారు.

ఆర్ట్‌ డైరెక్టర్‌ పెద్దిరాజు మాట్లాడుతూ – ”టీమ్‌ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి ధన్యవాదాలు” అన్నారు.

రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి,  కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్‌:పెద్దిరాజు అడ్డాల, యాక్ష‌న్:స‌్టంట్ జాషువ‌
, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్,  ప్రొడక్షన్‌ మేనేజర్‌: కిరణ్‌ కాసా, పిఆర్ఓ:బి.ఎ రాజు,చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి.