Hyper Aadi Marriage: త్వరలో హైపర్ ఆది పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

Hyper Aadi Marriage: జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి కూడా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించాడు. హీరోలకు ఫ్రెండ్‌గా, కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక డీ షోలో టీమ్ లీడర్‌గా వర్క్ చేసిన హైపర్ ఆది తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. జూనియర్ ఆర్టిస్టుగా బజర్దస్త్‌ షోలో ప్రస్థానం ప్రారంభించిన హైపర్ ఆది.. ఆ తర్వాత స్ట్రీప్ రైటర్ స్థాయి నుంచి టీమ్ లీడర్‌గా మారాడు.

hyper aadi marriage

అయితే తాజాగా హైపర్ ఆది పెళ్లి గురించి ఊహాగనాలు హల్‌చల్ చేస్తున్నాయి. మేలో హైపర్ ఆది పెళ్లి ఉంటుందని, ఇప్పటికే కుటుంబ సభ్యులు అమ్మాయిని కూడా ఫిక్స్ చేశారట. ఆ అమ్మాయి హైపర్ ఆది కుటుంబానికి చాలా దగ్గర బంధువుట. త్వరలో దీనిపై అఫీషియర్ ప్రకటన వచ్చే అవకాశముందని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది చూడాలి.