తమిళ సినిమాకి తెలుగులో కాపీ క్లెయిమ్ వచ్చి పడింది…

త‌మిళ స్టార్ హీరో ఇళయదళపతి విజ‌య్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా బిగిల్. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని తెలుగులో విజిల్ పేరుతో డబ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 25న తెలుగు తమిళ మలయాళ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకి రిలీజ్ ముందు ఊహించని కష్టం వచ్చింది. విజిల్ కథపై తెలంగాణ సినీ ర‌చ‌యిత‌ల సంఘంలో ఫిర్యాదు న‌మోదైంది. షార్ట్ ఫిలిం డైరెక్టర్ నంది చిన్నికుమార్ త‌న సినిమా స్ల‌మ్ సాక‌ర్‌ను ఆధారంగా చేసుకుని విజయ్ విజిల్‌ సినిమాను తెర‌కెక్కించార‌ని, ఈ నేప‌థ్యంలో విజిల్ బృందంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సినీ ర‌చ‌యిత‌ల సంఘాన్ని కోరారు.

whistle

ఈ రెండు క‌థ‌ల‌ను ప‌రిశీలించి తెలంగాణ ర‌చ‌యిత‌ల సంఘం ఫిర్యాదుపై స్పందించనుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు తెలుగులో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సమయంలో కాపీ క్లెయిమ్స్ రావడం, అది కూడా తమిళనాడు నుంచి కాకుండా తెలుగు నుంచి కావడం చిత్ర యూనిట్ ని ఆశ్చర్యపరిచి ఉంటుంది. మరి ఈ విషయమై బిగిల్ యూనిట్ ఎలా స్పందిస్తుంది? మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేక వాయిదా పడుతుందా అనేది చూడాలి.