గోపీచంద్ కి భోగవల్లి ప్రసాద్ షాక్ ఇచ్చాడా? సినిమా ఆగిపోయిందా?

హీరో గోపీచంద్… ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో. యాక్షన్ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ సినిమాలు కూడా చేసి హిట్ అందుకున్న మ్యాచో స్టార్ గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. రీసెంట్ గా చాణక్య సినిమా టైములో కంబ్యాక్ ఇచ్చిన గోపీచంద్ వరస సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకరి సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా. ఇందులో గోపీచంద్ ఆంధ్ర ఉమెన్స్ ఫుట్ బాల్ టీం కోచ్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

bvsn prasad gopichand

ఈ సినిమాతో పాటు గోపీచంద్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ బ్యానర్ లో ఒక సినిమాని అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా జరిపాడు. ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేయడంతో ఇక గోపీచంద్ మళ్లీ ట్రాక్ లోకి రావడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. అయితే ఊహించిన పరిణామాల కారణంగా గోపీచంద్, భోగవిల్లి ప్రసాద్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. బిను సుబ్రహ్మణ్యం తెరకెక్కించాల్సిన ఈ సినిమా ఆగిపోయింది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉంది అనే విషయం తెలియాలి అంటే గోపీచంద్ కానీ భోగవల్లి ప్రసాద్ కానీ ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉంది.