విజయ్ దేవరకొండ నిన్న తన కొత్త చిత్రాన్ని ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన టాపిక్ బాగా వైరల్ అయ్యింది. ఒక విధంగా అభిమానులు షాక్ లో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లాంటి హీరో నటిస్తుండడంతో ఈ కాంబినేషన్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఒక విధంగా మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి.
ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ స్నేహితుడు కేదార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కొత్త ప్రాజెక్ట్ పై అప్పుడే అంచనాల డోస్ పెరిగింది. ఇక వీరి కాంబినేషన్ కి సంబంధించిన మరొక న్యూస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే నిర్మాత కేదార్, సుకుమార్ కి అడ్వాన్స్ గా 10 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత కూడా లాభాలలో వాటా పొందవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రారంభం కావడానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ ముందే అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ న్యూస్ కూడా చర్చనీయాంశంగా మారింది.