భారీ ధరకు వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్

vakeel saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులను ఎనౌన్స్ చేసిన పవర్ స్టార్ వీలైనంత త్వరగా ఆ సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే వకీల్ సాబ్ షూటింగ్ కూడా ప్రస్తుతం ఏండింగ్ లోకి వచ్చేసింది. దసరా మరుసటి రోజు చివరి షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. నిర్మాత దిల్ రాజుకు ఒక విధంగా మంచి లాభాలు అందుతున్నట్లు తెలుస్తోంది. సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ సన్ నెట్వేర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. లాక్ డౌన్ లోనే ఓటీటీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకో నిర్మాత ఆ డీల్స్ కి ఒప్పుకోలేదు. ఇప్పటికైతే శాటిలైట్ డీల్ క్లోజ్ చేశారు. ఇక సినిమాను పరిస్థితులను బట్టి సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.